»   » ఇలయరాజా 'పా' రీమేక్ చిత్రంలో కమల్ హాసన్!

ఇలయరాజా 'పా' రీమేక్ చిత్రంలో కమల్ హాసన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం పా తమిళ రీమేక్ లో కమలహాసన్ నటించనున్నట్లు తెలిసింది. లుకేమియా అనే మానషిక వ్యాదితో బాధ పడే పాత్రలో అమితాబ్ అనితర సాధ్యమైన పాత్రను షోషించి మెప్పించారు. ఈ చిత్రం దేశం మొత్తం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడ తమిళంలోకి రీమేక్ చేయనున్నారు. సంగీత జ్ఝాని ఇళయరాజా తమిళ రీమేక్ హక్కులను పొందినట్టు సమాచారం. ఒరిజినల్ హిందీ చిత్రానికి ఆయనే సంగీతాన్ని అందించి అమితాబ్ ప్రశంసలను అందుకున్నారు. ఈ 'పా" చిత్ర రీమేక్ లో అమితాబ్ పాత్రలో నటించి మెప్పించ గల ఏకైక నటుడు కమలహాసనేనని భావించిన ఇళయరాజా ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ లో టాక్.

కమల్ ఇప్పటికే హిందీలో హిట్ అయిన ఏ వెడ్నెస్ డే చిత్ర రీమేక్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ 'పా" చిత్రం రీమేక్ లోనూ ఆయన నటించే విషయం దాదాపు ఖరారయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించాలని మొదటి నుంచి ఆసక్తి చూపుతున్న ప్రకాష్ రాజ్ కూడా ఒక పాత్రలో నటించనున్నట్టు తెలిసింది. అయితే కమల్, కెఎస్. రవికుమార్ కాంబినేషన్ లో ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభంకానుంది. దాని తర్వాతే కమల్ పా చిత్రంలో నటిస్తారని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu