»   » డీజీపీ, పోలీస్ కమిషనర్ లకు ఇళయరాజా కంప్లైంట్

డీజీపీ, పోలీస్ కమిషనర్ లకు ఇళయరాజా కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్‌ఐలకు సంగీత జ్ఞాని ఇళయరాజా లేఖ రాశారు. ''నా పాటలను తస్కరిస్తున్నారు. నా అనుమతి లేకుండా సొమ్ము చేసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి'' అని ఇళయరాజా ఆ లేఖలో కోరారు. గతంలోనూ ఆయన ఇలా సీరియస్ అయ్యి...కోర్టుకు వెళ్లారు..కానీ పెద్ద ఫలితం కనపడలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తన పాటలు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు టీవీ, రేడియో ఛానల్స్ ప్రసారం చేయడంపై, ఆడియో కంపెనీలు సీడీలు చేసి అమ్మడంపై ఇళయరాజా ఆగ్రహంగా ఉన్నారు. తన పాటలను సీడీల రూపంలో, ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ రూపంలో అమ్ముతున్న ఐదు ఆడియో కంపెనీలపై కేసు వేసారు కూడా. మద్రాసు హై కోర్టు కూడా ఆయనకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇకపై తన పాటలు ఎవరు ఎక్కడ వాడాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే, తన వద్ద రైట్స్ కొనుక్కోవాల్సిందే అని ఇళయరాజా స్పష్టం చేసారు.

Ilayaraja approaches police to prevent misuse of his music

ఆయన విన్నపాన్ని పరిశీలించి, ఇళయరాజా అనుమతి లేకుండా పాటలను ఎవరూ వినియోగించకూడదంటూ న్యాయస్థానం ఓ ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వును కూడా చాలామంది ఖాతరు చేయడంలేదు. దాంతో తన పాటలను వాడుకుంటున్న రికార్డింగ్ కంపెనీలను, రేడియో స్టేషన్లను, ఆన్‌లైన్ పైరసీని అడ్డుకోవడానికి అభిమానుల ద్వారా ఇళయరాజా చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని ఇదిగో ఇలా ...లేఖలు రాసారు. మరి ఇవైనా ఎంతవరకూ ఫలిస్దాయో చూడాలి అంటున్నారు.

నేను స్వరపర్చిన పాటలన్నింటి పైనా హక్కులు నావే.. కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ ప్రకటన విడుదల చేసారు. తన అనుమతి లేనిదే తన పాటలు ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

1970 నుండి పాటలను స్వర పరుస్తున్న ఇళయరాజా ఇప్పటి వరకు 4500 పాటలను కంపోజ్ చేసారు. నేను పాటలను కంపోజ్ చేసాను, వాటిని సినిమాల కోసం అమ్ముకున్నాను....కానీ కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం ఆ పాటలపై సర్వ హక్కులు నావే. నా అనుమతి లేకుండా ఇతరులు వాడటానికి వీలు లేదు. ముఖ్యంగా ఆడియో కంపెనీలు నా పాటలను నా అనుమతి లేకుండా అమ్మడానికి వీలు లేదు అని తెగేసి చెప్పారు.

English summary
Ilayaraja has sought police intervention against illegal exploitation of his music by record labels, FM radio stations and online pirates.
Please Wait while comments are loading...