పాటలులేని ఇళయరాజా చిత్రం!
చెన్నై : ఇళయరాజా అంటేనే అద్భుతమైన పాటలకు ప్రతిరూపం. ఇప్పుడాయన పాటలు లేకుండా ఓ సినిమాకి సంగీతం సమకూర్చుతున్నారు! వైవిధ్యం కోసం పరితపించే మిష్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓనాయుం ఆట్టుకుట్టియుం'. ఇందులో కథానాయిక కూడా లేదు.
చిత్ర విశేషాల గురించి దర్శకుడు ముచ్చటిస్తూ.. 'ఓనాయుం ఆట్టుకుట్టియుం' కోసం ఇళయరాజాను కలిశాను. గతంలో నా దర్శకత్వంలో వచ్చిన 'నందలాలా' చిత్ర సమస్య కారణంగా నన్ను ఆయన చూసిన వెంటనే 'ముందు బయటకు వెళ్లిపో..!' అన్నారు. ఆ సమస్యకు కొన్ని కారణాలు చెప్పాక 'ఓనాయుం..' గురించి విన్నారు. 'ఇందులో పాటలేవీ లేవు సార్..' అన్నాక ఎగాదిగా చూశారు.
కథ వినిపించాక 'తప్పకుండా చేస్తా'నని భరోసా ఇచ్చారు. ఆయన ఒప్పుకున్నాక నాకు మరింత బలం వచ్చింది. 'వళక్కు ఎన్..'లో నటించిన శ్రీ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. చిత్రీకరణ చివరిదశలో ఉంది. సెప్టెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పాడు.


Click it and Unblock the Notifications












