ఆస్ట్రేలియాలో ఇళయరాజా కచేరీ..డిటేల్స్

By Srikanya

చెన్నై: 'సంగీత జ్ఞాని' ఇళయరాజాకు దేశదేశాల్లో ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటీవలే లండన్‌లో విజయవంతంగా కచేరీ పూర్తి చేసిన ఇళయరాజా ...28న ఆస్ట్రేలియాలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఎంకేఎస్‌ సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇళయరాజా సంగీతంలోని తెలుగు, తమిళం, మలయాళ పాటలు పాడనున్నారు.

Ilayaraja

ఈ కార్యక్రమంలో ఎస్పీబీ, చిత్ర, ఎస్పీ శైలజ, కార్తిక్‌, మధుబాల, జయచంద్రన్‌, చిన్మయి, భవతారణి, కార్తికేయన్‌, యువన్‌శంకర్‌ రాజాలతోపాటు పలువురు గాయకులు పాల్పంచుకోనున్నారు. ఇందుకోసం బుధవారం వారు చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు. ఈ పోగ్రాంకి ఎక్కడెక్కడి ఇళయరాజా అభిమానులు హాజరవుతున్నారు. అక్కడ ఈ పోగ్రాం ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

ఇళయరాజా మాట్లాడుతూ.. నేను చాలా సాహసాలు చేశానని అందరూ అంటున్నారు. ఎంత చేశానని నాకు తెలిస్తే ఆ తర్వాత చేయలేను. అది తెలియకుండా ఉండటమే మంచిది. ఒకప్పట్లో సరైన స్పాన్సర్లు లేక విదేశాల్లో కచేరీలు నిర్వహించలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు విదేశీ ప్రేక్షకుల కోరిక మేరకు, ఇక్కడి స్పాన్సర్ల ఉత్సాహంతో కచేరీలు చేయాలనుకుంటున్నాను. కచేరీ ఎప్పుడు చేసినా పూర్వాభినయం తప్పనిసరి. నేను సంగీతం సమకూర్చిన పాటే అయినా ఓసారి రిహార్సల్‌ చేసుకుంటేనే బాగుంటుందని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X