»   » వారికి గుడి నాకు అభిమాన సంఘమా: ఇలియానా!?

వారికి గుడి నాకు అభిమాన సంఘమా: ఇలియానా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానాని ముద్దుగా ఆమె అందాల ఖజానా అని, ఎల్లోర శిల్పం అని, పిల్చుకుంటారు. అయితే తెలుగులో మూడు సంవత్సరాలలో డజను సినిమాలకు పైగా చేసిన ఇలియానా తమిళంలో జోతి కృష్ణ దర్శకత్వంలో రవికృష్ణ సరసన చేసిన చిత్రం 'కేడి". ఒక్క సినిమానే అయినా ఆమె అంటే పడి చచ్చే అభిమానులు అక్కడ చాలామందే ఉన్నారు. మాములుగా తాము పిచ్చిగా అభిమానించే నాయికలకు ఏకంగా అక్కడివాళ్ళ గుడి కట్టిస్తారు. ఖుష్బూ, సిమ్రాన్ ల హవా నడుస్తున్న సమయంలో వాళ్శకి దేవాలయాలు కట్టేశారు. మొన్నామద్య అనుష్కకి గుడి కట్టారని వినికిడి అయితే ఆమె నిరాకరించడంతో మరళా దాన్ని తొలగించినట్లు సమాచారం.

అయితే అభిమానులు ఇలియానాకి గుడి కట్టించలేదు కానీ అభిమాన సంఘం ఆరంభించారట. ఒక్క సినిమాతోనే ఆమెకు అభిమాన సంఘం ఏర్సడడం ఆశ్చర్యకరమే. అయితే ఇలియానా తమిళంలో మళ్ళీ నటిస్తుందా అని తన అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారట. అందుకోసం అక్కడి హీరోలు కూడా ఇలియానాని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu