65 సంవత్సరాల ముసలి బామ్మగా హాట్ బ్యూటీ ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా త్వ రలో 65 సంవత్సరాల ముసలి బామ్మగా కనిపించి షాక్ ఇవ్వనుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందే బర్భి చిత్రం కోసం ఆమె ఆ వేషం కట్టనుంది.ఇక ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. అతను చెమిటి,మూగ వ్యక్తిగా కనిపిస్తాడు.అతను ముసలి వయస్సు దాకా కధ నడుస్తుంది. కాబట్టి అతని తోడుగా చేసే ఇలియానా కూడా ఆ వయస్సులో కనిపించాలి.
ఇక సెక్సి ఇమేజ్ ఉన్న ఆమె మెప్పించగలదా అని అందరూ సందేహ పడ్డారుట.అయితే అందరినీ షాక్ ఇచ్చేలా ఆమె ఫెరఫార్మెన్స్ సాదిందని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు.అయితే ఇలియానా మాత్రం సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆ స్టిల్స్ బయిటకు రాకూడదని,వాటిని ఎట్టిపరిస్దితుల్లోనూ పబ్లిసిటీకి వాడి హైలెట్ చేయకూడదని ఎగ్రిమెంట్ చేసుకున్నదని సమాచారం.


Click it and Unblock the Notifications











