»   » తొలిసారిగా జనం సమక్షంలో ఇళయరాజా బాణీలు

తొలిసారిగా జనం సమక్షంలో ఇళయరాజా బాణీలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ilayaraja
చెన్నై : 'ఇసైజ్ఞాని' ఇళయరాజా ఏది చేసినా సంచలనమే. అలాగే సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. తాజాగా ఆయన 'రాజరాజ చోళనిన్‌ పోర్‌వాల్‌' అనే చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో స్నేహన్‌ హీరో. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల కరూర్‌లోని పసుపతీశ్వర ఆలయంలో జరిగింది. అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో ఇళయరాజా, స్నేహన్‌, దర్శకుడు అముదేశ్వర్‌ పాల్గొన్నారు. దర్శకుడు అముదేశ్వర్‌ సందర్భం చెబుతుండగా ఇళయరాజా అందరి సమక్షంలో బాణీలు కట్టారు.

ఇళయ రాజా మాట్లాడుతూ.. హిట్‌ టీమ్ మళ్లీ కలిస్తే అందులోని పాటలు చాలా బాగుంటాయనే మాటలు తరచూ వింటుంటాం. అందులో వాస్తవం లేదన్నదే నా అభిప్రాయం. ఇది వరకు ఒంటరిగానే పాటలకు బాణీలు కట్టాను. కథ, సందర్భం మాత్రమే వింటాను. ఆ తరహాలో వేడివేడిగా కట్టిన ఈ బాణీలు విన్నందుకు అందరికీ కృతజ్ఞతలని చెప్పారు. అనంతరం ఆలయవీధి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై యూనిట్ ప్రసంగించింది.

ఇక ఇళయరాజా అంటేనే అద్భుతమైన పాటలకు ప్రతిరూపం. ఇప్పుడాయన పాటలు లేకుండా ఓ సినిమాకి సంగీతం సమకూర్చుతున్నారు! వైవిధ్యం కోసం పరితపించే మిష్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓనాయుం ఆట్టుకుట్టియుం'. ఇందులో హీరోయిన్ కూడా లేదు.

చిత్ర విశేషాల గురించి దర్శకుడు ముచ్చటిస్తూ.. 'ఓనాయుం ఆట్టుకుట్టియుం' కోసం ఇళయరాజాను కలిశాను. గతంలో నా దర్శకత్వంలో వచ్చిన 'నందలాలా' చిత్ర సమస్య కారణంగా నన్ను ఆయన చూసిన వెంటనే 'ముందు బయటకు వెళ్లిపో..!' అన్నారు. ఆ సమస్యకు కొన్ని కారణాలు చెప్పాక 'ఓనాయుం..' గురించి విన్నారు. 'ఇందులో పాటలేవీ లేవు సార్‌..' అన్నాక ఎగాదిగా చూశారు. కథ వినిపించాక 'తప్పకుండా చేస్తా'నని భరోసా ఇచ్చారు. ఆయన ఒప్పుకున్నాక నాకు మరింత బలం వచ్చింది. 'వళక్కు ఎన్‌..'లో నటించిన శ్రీ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. చిత్రీకరణ చివరిదశలో ఉంది. సెప్టెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పాడు.

English summary
Ilayaraja, known for composing tunes by sitting inside air-conditioned studios, enthralled a large audience at the famous Kalyana Pasupatheeswarar temple in Karur on Wednesday by composing in public for the first time the tunes for upcoming Tamil film, Raja Raja Chozhanin Porval (Sword of Raja Raja Chozhan), much to the delight of his fans and the public. Ilayaraja, a man of many novelties, performed this rare feat at the launch of Raja Raja Chozhanin Porval at Siddhar Karuraar sannidhi at the Kalyana Pasupatheeswarar temple at the behest of lyricist Snehan. Since the film is about the sword of Raja Raja Chozhan and Karur Siddhar happens to be his guru, we decided to have the event at the temple, Snehan, who plays the lead in the film, explained.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu