»   » 97 కోట్లు అప్పు .. 'ఐ' నిర్మాత ఆస్తి జప్తు

97 కోట్లు అప్పు .. 'ఐ' నిర్మాత ఆస్తి జప్తు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సిని పరిశ్రమలో ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఓ వెలుగు వెలిగిన నిర్మాతలు ఓ సినిమా దెబ్బ తింటే కోలుకోవటం చాలా కష్టం కావచ్చు. అలాగే ఓ శుక్రవారం రిలీజైన సినిమా హిట్టేతే అప్పటి వరకూ దరిద్రంతో ఉన్న నిర్మాత ఒక్కసారిగా పెద్ద నిర్మాత కావచ్చు. అయితే ఎక్కువ సార్లు ...సినిమా కోసం చేసిన అప్పులు...అవి తీర్చలేక...పడే కష్టాలే కనపడుతూంటాయి. తాజాగా అలాంటి సంఘటన తమిళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బ్యాంకులో 97 కోట్ల బకాయిలు ఉన్న చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆస్తులను సదరు బ్యాంకు జప్తు చేసింది. ప్రముఖ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్. ఈయన కమల్‌హాసన్ నటించిన దశావతారం, విక్రమ్ నటించిన అన్నియన్, ఐ వంటి పలు చిత్రాలను నిర్మించారు. చిత్రాల నిర్మాణం కోసం చెన్నైలోగల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆస్తులను తాకట్టు పెట్టి రుణం పొందినట్లు సమాచారం. ఈ మొత్తం వడ్డీతో కలిసి రూ.97 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

IOB Takes Over Aascar's Properties for Failure to Repay Dues

నిర్ణీత గడువులోగా రుణాన్ని చెల్లించనందున ఆస్కార్ రవిచంద్రన్ ఆస్తులను జప్తు చేసేందుకు బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థకు సొంతమైన భవనాలు, ఇళ్లు, థియేటర్లు సహా ఐవోబీ జప్తు చేసింది. దీనిగురించి ఆస్కార్ ఫిలింస్ సంస్థ తరపున ఈవిధంగా తెలియజేయబడింది. రుణం చెల్లించేందుకు తగిన గడువు కోరామని, దీని గురించి బ్యాంకు అధికారులకు లేఖ రాశామన్నారు. అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. త్వరలో రుణాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు.

ఇదే నిర్మాత తాజా చిత్రం విశ్వరూపం 2 కూడా విడుదలకు నోచుకోలేదు. కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2' రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తైనా విడుదల కావటం లేదు. అయితే ఇలా విడుదల ఆలస్యం కావటానికి కారణం నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అని తేల్చారు కమల్ హాసన్.

కమల్ హాసన్ మాట్లాడుతూ.... " నాకు ఈ చిత్రం ఎందుకు విడుదల లేటవుతోందో తెలియదు. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్ణయించుకోవాలి. అసలు ఈ చిత్రం విడుదల కాకుండా ఎందుకు ఆగుతుందో కారణం తెలుసుకోవాలి." "ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను ఐడిల్ గా కూర్చోలేను. అందుకే నేను ఉత్తమ విలన్, పాప నాశమ్ చిత్రాలు చేసాను ." అన్నారు.

English summary
The Indian Overseas Bank on Thursday issued a takeover notice of four properties belonging to Aascar Ravichandran of Oscar Films Pvt Ltd, who most recently produced Shankar’s I, for defaulting on a Rs 96.75 crore loan. The four properties include one in Ashok Nagar and a flat on Prithvi Avenue, Mylapore in Chennai, a theatre complex in Vellore and another theatre complex in Salem.
Please Wait while comments are loading...