»   » ‘కబాలి’ నే టార్గెట్‌ , కలెక్షన్స్ లో దాటాలనే లక్ష్యం

‘కబాలి’ నే టార్గెట్‌ , కలెక్షన్స్ లో దాటాలనే లక్ష్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నిన్నటిదాకా బాహుబలి ని దాటాలని అందరు పెద్ద హీరోలు టార్గెట్ గా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కబాలి' సినిమా చెన్నైలో సాధించిన కలెక్షన్‌లు దాటాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

'కబాలి' సినిమా ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు వారాల్లో ఏకంగా రూ.11 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. చెన్నైలో ఈ చిత్రం హక్కులను జాజ్‌ సినిమా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెన్నై మంచి లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.


'Iru Mugan' target to cross 'Kabali' collections

ఇదిలా ఉండగా జాజ్‌ సంస్థ తాజాగా విక్రం నటించిన 'ఇరుముగన్‌' సినిమా చెన్నై హక్కులను సొంతం చేసుకుంది. చెన్నైలోని 'కబాలి' కలెక్షన్‌ను మించేలా దీన్ని తీసుకెళ్లాలని జాజ్‌ సినిమా బృందం భావిస్తున్నట్లు చెబుతున్నారు.


ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఇరుముగన్‌'లో నయనతార, నిత్యామేనన్‌ హీరోయిన్స్ గా నటించారు. శిబుతమీన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల సినిమా పాటలను విడుదల చేశారు. సెప్టెంబరు తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


'Iru Mugan' target to cross 'Kabali' collections

ఈ చిత్రం తెలుగులో 'ఇంకొకడు' పేరుతో విడుదల కానుంది. నయనతార, నిత్యామేనన్‌ కథానాయికలు. ఈ చిత్రంలో అఖిలన్‌, లవ్‌ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్‌ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన చిత్ర ట్రైలర్‌ను చూస్తే విక్రమ్‌ సినిమాపై అంచనాలను మరోసారి పెంచేసింది.


లవ్‌ పాత్రలో కనిపించిన విక్రమ్‌ను చూస్తే నటనలో ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని నిరూపించేలా ఉంది. ఈ చిత్రానికి హ్యారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్‌లో 'ఇంకొకడు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది

English summary
After distributing Superstar Rajinikanth's latest blockbuster 'Kabali' now Jazz Cinemas have reportedly bagged the distribution of another highly expected biggie. Jazz Cinemas have acquired the Tamil Nadu distribution rights Chiyaan Vikram's upcoming mega budget action entertainer 'Iru Mugan' for a huge price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu