»   » హీరోకి నచ్చే టైటిల్ పెట్టలేక గగ్గోలు

హీరోకి నచ్చే టైటిల్ పెట్టలేక గగ్గోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : స్టార్ హీరో చిత్రం అంటే టైటిల్ దగ్గర నుంచి వైవిధ్యం ఉండాలి. సినిమాకు పెట్టే టైటిల్ పై కూడా బిజినెస్ పై అంచనాలు ఉంటాయి. అంతేకాకుండా టైటిల్ విషయంలోనూ అభిమానులను సైతం సంతృప్తి పరచాలి. అందుకే దర్శక,నిర్మాతలు కథ కన్నా ముందు టైటిల్ ఆలోచించుకుని, రిజిస్టర్ చేయించుకుని పదిలింగా కాపాడుకుంటూంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రానికి టైటిల్ ఏం పెట్టాలా అని దర్శకుడు గౌతమ్ మీనన్ కి సమస్య ఎదురైందిట. ఎందుకంటే ఆ టైటిల్ ...అజిత్ కి నచ్చాలి. ఆయన ఏ టైటిల్ పెడుతున్నా అజిత్ ...పెద్దగా ఆసక్తి చూపడటం లేదట. మరో ప్రక్క ఫలానా టైటిల్ పెట్టండంటూ అజిత్ అభిమానుల నుంచి రోజుకో సూచన అందుతోందిట.

అజిత్‌ సినిమా అంటేనే.. కోలీవుడ్‌లో అంచనాలు రెట్టింపుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమా టైటిల్ పై కూడా ప్రేక్షకాభిమానులు ఆసక్తిని కనబరుస్తారు. ముందుగా టైటిల్ ఎనౌన్స్ చేస్తే కాస్త పబ్లిసిటీ చేసుకుని జనాల్లోకి తీసుకు వెళ్తాం అని వారు కోరుతూంటారు. అయితే అజిత్ సినిమాలకు టైటిల్ చివరి రోజు వరకూ సెట్ కావటం లేదు. ఆ మధ్యన అజిత్‌ నటించిన 'ఆరంభం' సినిమా విడుదలకు కొన్నిరోజులుండగా నామకరణం చేశారు. టైటిల్‌ పెట్టడంలో అంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు అజిత్‌.

Is Ajith and Anushka Shetty’s next film titled Sathya?

ఈ నేపథ్యంలో అజిత్‌ ప్రస్తుతం గౌతంమీనన్‌ దర్శకత్వంలో నటిస్తున్న 55వ చిత్రానికి టైటిల్‌ పెట్టడంలోనే చాలా సమయం తీసుకుంటున్నారు. కథలోని అజిత్‌ పాత్రను బట్టి సినిమా పేరును నిర్ణయించనున్నారని సమాచారం. ఈ సినిమాలో అజిత్‌ సత్యదేవ్‌ అనే పాత్రలో నటిస్తున్నట్లు వినికిడి. ఆ ప్రకారం సినిమాకు 'సత్య' అని పేరు పెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి గౌతంమీనన్‌ నోట ఏ 'పేరు' వస్తుందో వేచిచూడాలి.

తన చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే హీరో అజిత్‌. 'ఆరంభం', 'వీరం' వంటి వరుస హిట్లతో ఆయన స్థాయి మరింత పెరిగింది. దీనికి తోడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తొలిసారిగా నటించనుండటంతో కోలీవుడ్‌లోనే ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి.
అజిత్‌కు జంటగా.. అనుష్క, ఎమీ జాక్సన్‌ ఆడిపాడనున్నారు. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఇందులో అజిత్‌ను సరికొత్త గెటప్‌లో చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్‌ హెయిర్‌స్టెల్‌ వినూత్నంగా ఉండనుందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

English summary
Ajith and Anushka Shetty will be seen together in Gautham Menon’s next. There were reports that the film is titled Sathya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu