యువ హీరోతో అమలా పాల్ పెళ్లి.. తమిళ పరిశ్రమను కుదిపేసిన వార్త

తమిళనాడులో యువ హీరో విష్ణు విశాల్ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన రాట్సాసన్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. రామ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ ఏడాదిలోనే అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రంగా విష్ణు విశాల్‌ కెరీర్‌లో నిలిచింది. అయితే ఇలాంటి సక్సెస్ జోష్‌లో ఉన్న విశాల్ విష్ణు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తమిళ పరిశ్రమను కుదిపేసింది. వివరాల్లోకి వెళితే..

 అమలాపాల్‌తో విష్ణు విశాల్ పెళ్లి

అమలాపాల్‌తో విష్ణు విశాల్ పెళ్లి

యువ హీరో విష్ణు విశాల్, అమలా పాల్ రాట్సాసన్ చిత్రంలో జంటగా నటించారు. అప్పటి నుంచే మీడియాలో వీరి రిలేషన్ గురించి గాసిప్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరు పెళ్లి చేసుకొన్నారనే వార్త తమిళ పరిశ్రమలో దావానలంగా మారింది. సినీ వర్గాల్లో ఎక్కడ చూసిన అదే ముచ్చట వినిపించింది.

ఖండించిన విష్ణు విశాల్

ఖండించిన విష్ణు విశాల్

అమలాపాల్‌తో పెళ్లి జరుగబోతున్నదనే వార్తతో విష్ణు విశాల్‌ కంగుతిన్నాడు. వెంటనే సోషల్ మీడియాలో స్పందించారు. తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. తన పెళ్లి వార్తలను ఎవరూ నమ్మవద్దు అని రిక్వెస్ట్ చేశాడు.

నా పెళ్లి వార్త స్టుపిడ్ అని

నా పెళ్లి వార్త స్టుపిడ్ అని

నా పెళ్లి వార్త ఓ స్టుపిడ్ న్యూస్. బాధ్యతగా మాట్లాడండి.. వ్యవహరించండి. మనం మనుషులమనే విషయం మరిచిపోకండి. మాకు ఫ్యామిలీలు ఉన్నాయి. పబ్లిసిటీ కోసం ఏదో రాయవద్దు అని ట్వీట్ చేశారు. దాంతో పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చాయి.

ఇటీవలే విష్ణు విశాల్ విడాకులు

ఇటీవలే విష్ణు విశాల్ విడాకులు

విష్ణు విశాల్ ఇటీవలే తన భార్య రజనీ నుంచి విడాకులు పొందారు. కాలేజీ నుంచే స్నేహితులుగా ఉన్న వారిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు. రాట్సాసన్ రిలీజ్ తర్వాత రజనీ నేను విడాకులు తీసుకొన్నామని సోషల్ మీడియాలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

 గతంలో విడాకులు పొందిన అమలాపాల్

గతంలో విడాకులు పొందిన అమలాపాల్

అందాల నటి అమలా పాల్, దర్శకుడు ఏఎల్ విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఏడాది తిరుగకముందే వారి దాంపత్య జీవితంలో విభేదాలు నెలకొన్నాయి. అప్పటి నుంచి అమలా పాల్ ఒంటరిగానే ఉంటున్నది. గత కొద్దికాలంగా విష్ణు విశాల్‌తో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X