రజనీ 'రోబో' స్టోరీలో అధ్దిరిపోయే ట్విస్ట్ అదేనా?
రజనీకాంత్ రోబో చిత్ర కథ అంటూ గత కొద్ది రోజులుగా చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ కథనం, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రచారంలోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా అదే, ఎస్.ఎమ్.ఎస్ ల్లోనా అదే తిరుగుతోంది. ఎందుకంటే ఆ కథ నిజమైనా కాకపోయినా కథగా ఓ మంచి ట్విస్ట్ తో ఆ స్టోరీ బాగుంది. ఇంతకీ ఆ కథ,అందులో అద్దిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే...రజనీకాంత్(సైంటిస్టు) తన అధ్బుతమైన మేధస్సుతో మానవ మస్తిష్కంలా పనిచేసే ఓ రోబోని సృష్టిస్తాడు. అయితే ఆ రోబోకి నిజంగానే మనుష్యులు బుద్దులు వచ్చేసి తనను రూపొందించిన మానవ జాతినే అంతంచేసేసి రోబో జాతిని విస్తరించాలని పన్నాగం పన్నుతుంది. అందుకు మొదటిగా ఆ సైంటిస్ట్ రజనీపైనే తిరగబడి..తర్వాత మానవాళిపై దాడికి బయిలుదేరుతుంది. ఆ దిశలో తిరుగుతున్న రోబోను ఎలా కంట్రోల్లో పెట్టాలో తెలియక రజనీ తికమకపడతాడు.
అప్పుడు రజనీ లవర్ ఐశ్వర్యారాయ్..ఆ రోబోని తన ఆకర్షణలో పడేసి కట్టిపడేస్తుంది. దాంతో రోబో ఓ ప్రక్క, సైంటిస్టు రజనీ ఓ ప్రక్క ఐశ్వర్య వెనుక పడుతూ ప్రేమ పాఠాలు వల్లిస్తూంటారు. ఇలా నడిచే కథలో ఫైనల్ ట్విస్ట్ ఏమిటంటే...ఐశ్వర్యరాయ్ కూడా ఓ రోబోనే కావటం అని తెలుస్తోంది. కావాలనే రోబోని కంట్రోల్లో పెట్టడానికి మరో ఐశ్వర్య రోబోని సృష్టించి, తను కూడా ఐశ్వర్య వెనక పడుతున్నట్లు నాటకమాడి, రోబోని రెచ్చగొట్టి దాన్ని నాశనం చేస్తాడని చెప్పుకుంటున్నారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ ట్విస్టు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటున్నారు. అయితే రోబో ప్రోమోలు, పోస్టర్స్, అందులో ఐశ్వర్య రోబోలో స్టిల్ చూసి తమిళ తంభీలు కథ అల్లేసి ఉంటారని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది నిజమో తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











