For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ 'కబాలి'‌ కథ ఇదే? ...ఆ సినిమా కి కాపీనా? (కొత్త ఫొటోలతో)

  By Srikanya
  |

  చెన్నై‌: రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి'‌. పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికర కథనం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో ప్రచారమవుతోంది. దాంతో సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది.ఆ కథ ని మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు.

  అందుతున్న సమాచారం ప్రకారం ఇది కిడ్నాపైన తన కూతురుని రక్షించే కథ అని చెప్తున్నారు. అంతేకాదు..ఈ చిత్రం యాక్షన్ చిత్రం టేకిన్ ఆధారంగా రూపొందుతోందని చెప్తున్నారు.

  అందుతున్న సమాచారం ప్రకారం ...రజనీ కాంత్ రిటైరైన ఓ గ్యాంగస్టర్. ఆయన రిటైన తర్వాత... తన కుమార్తె (ధన్సిక) కిడ్నాప్ కు గురి అవుతుంది. దాంతో కిడ్నాప్‌కు గురైన తన కూతుర్ని కాపాడుకునే క్రమంలో గ్యాంగ్‌స్టర్‌ కార్యక్రమాలకు ఇచ్చిన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొని మలేషియాలో మళ్ళీ చెలరేగే పాత్రలో రజనీ కనిపించనున్నారని సమాచారం. గాడ్ ఫాదర్ తరహాలో రజనీ పాత్ర సాగనుందని తెలుస్తోంది.

  స్లైడ్ షోలో... కబాలి కథేంటి అనేది ...కొత్త ఫొటోలతో చూడండి...

  పోలీక

  పోలీక

  టేకిన్ చిత్రంలోనూ హీరో ఇంటిలిజెన్స్ ఆఫీసర్..కిడ్నాపైన కుమార్తె కోసం కథ నడుస్తుంది

  అక్కడ ..ఇక్కడ

  అక్కడ ..ఇక్కడ

  కబాలిలో రజనీ గ్యాంగస్టర్...టేకిన్ లో ఇంటిలిజెన్స్ ఆఫీసర్

  యాక్షన్ థ్రిల్లర్

  యాక్షన్ థ్రిల్లర్

  రెండు చిత్రాలూ యాక్షన్ చిత్రాలే కావటం విశేషం

  మారింది

  మారింది

  కబాలికు పూర్తి బ్యాక్ డ్రాప్ మార్చి మాఫియా ని తీసుకోవటమే ప్లస్ అంటున్నారు.

  డ్రగ్ ఎడిక్ట్ గా

  డ్రగ్ ఎడిక్ట్ గా

  ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం.

  దన్సిక పాత్ర

  దన్సిక పాత్ర

  ఆమె ఈ చిత్రం రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.

  నిజ జీవితంలోవి ..

  నిజ జీవితంలోవి ..

  కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు.

  కాంటాక్ట్ లేబర్ తో కనెక్షన్

  కాంటాక్ట్ లేబర్ తో కనెక్షన్

  శ్రీలంకలో కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు.

  దేముడుగా

  దేముడుగా

  బడుగు వర్గాల వారు అంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు.

  సోషల్ మెసేజ్

  సోషల్ మెసేజ్

  సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

  మరో కీ రోల్ లో

  మరో కీ రోల్ లో

  అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు.

  ఇమేజ్ పట్టించుకోవద్దు

  ఇమేజ్ పట్టించుకోవద్దు

  తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం

  ఫస్ట్ లుక్ రెస్పాన్స్

  ఫస్ట్ లుక్ రెస్పాన్స్

  వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక,నిర్మాతలు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  మలేషియా

  మలేషియా


  కొన్ని రోజుల క్రితమే 'కబాలి' యూనిట్ షూటింగ్ నిమిత్తం మలేసియా వెళ్లింది. అక్కడ రజనీకాంత్‌కు మలేసియా అధికారవర్గాలు ఘనస్వాగతం పలికాయి.

  భారీ సెట్

  భారీ సెట్

  ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మలేసియాలోని మలాక్కా ప్రాంతంలో భారీ సెట్‌లు వేశారు.

  జెల్ సెట్

  జెల్ సెట్


  ఇందులో ఓ జైలు సెట్‌ కూడా ఉంది. అందులో ఖైదీగా ఉన్న రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

  ఫైట్స్ సీన్స్

  ఫైట్స్ సీన్స్

  ఆ తర్వాత ఫైట్ సీన్స్ చిత్రీకరించనున్నారు.

  వెలకమ్

  వెలకమ్

  చిత్రీకరణలో ఉన్న రజనీకాంత్‌ను చూసేందుకు మలేసియాలోని భారతీయులు వస్తున్నారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
  వారికోసం రజనీకాంత్‌ సాయంత్రం సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.

  చాలా భాగం

  చాలా భాగం

  మలేసియాలో 'కబాలి'లోని 75 శాతం సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు రజనీకాంత్‌ తన సన్నిహిత వర్గాలతో చెప్పారు.

  షూటింగ్ డేస్

  షూటింగ్ డేస్

  మలేషియాలో 60 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది.

  English summary
  Here is a tale which suggestsRajinikanth’s Kabali movie’s plot is heavily inspired by the Liam Neeson actionthriller, Taken, which is set in France. Word is that that he is portrayed as a once-powerful, now retired gangster who returns to his underworld activities because of his daughter’s kidnapping.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X