»   »  మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్?

మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajinikanth
శంకర్ దర్శకత్వంలో రానున్న రొబో కన్నా ముందే రజనీ ఓ యాక్షన్ ఫిల్మ్ లో చేసి తన అభిమానులను తృప్తి పరచాలని నిర్ణయించకున్నారని తెలుస్తోంది. అది కూడా గజనీ వంటి మెగా హిట్ ఇచ్చిన మురుగదాస్ దర్శకత్వంలో అనేది ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో వినపడుతున్న హాట్ టాపిక్ . ఎందుకంటే భారీ గ్రాఫిక్స్ తో రానున్న రొబొ సినిమా చాలా ఆలస్యమయ్యేటట్లు ఉందని అప్పటి వరకూ తను నటించిన ఏ సినిమా రిలీజ్ కాకుండా ఉండటాన్ని రజనీ ఊహించలేకపోతున్నారుట. అందులోనూ కుశేలన్ (కథానాయకుడు) నెగిటివ్ రిజల్ట్ రజనీకాంత్ ని ఆలోచనల్లోకి నెట్టోస్తోంది.

తన ఛరిష్మా తగ్గలేదని నిరూపించటానికి రజనీ డిసైడ్ అయ్యారని అంటున్నారు.అలాగే కొద్ది కాలం క్రిందట మురుగదాస్ ఆయనని కలసి ఓ యాక్షన్ ప్యాకెడ్ స్టోరీ వినిపించాడుట.మరో ప్రక్క మురగదాస్ హిందీలో అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న గజనీ రీమేక్ సినిమా పూర్తి కావచ్చిందని దాంతో అతను మరో సినిమా కోసం వెతుకుతున్నారని చెప్తున్నారు. ఈ విషయమై మా చెన్నై ప్రతినిధి మురగదాస్ ని ఫోన్ లో సంప్రదిస్తే అతను ప్రపోజల్ రజనీ ముందు ఉందని ఆయన డెషిషన్ పై మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X