»   » పరాకాష్టే :బూతు హీరోకు..బూతు డైరక్టర్ తోడు

పరాకాష్టే :బూతు హీరోకు..బూతు డైరక్టర్ తోడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళంలో ఈ మధ్యకాలంలో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం . ‘త్రిష ఇల్లనా నయన్‌తార' (తెలుగులో త్రిష ఇలియానా నయనతార). ఈ చిత్రం పూర్తి ద్వందార్దాలతో నడుస్తూ యూత్ ని ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు ఆ ఉత్సాహంతో పెద్ద హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరుగుతున్నాడు. తాజాగా ఆయన ఓ స్టార్ హీరోని పట్టుకున్నాడు. ఎవరూ అంటే.. ఇంకెవరు శింబు.

బీప్ సాంగ్ అంటూ ఓ బూతు పాటతో తమిళనాట సంచలనం క్రియేట్ చేసి, అరెస్ట్ వారెంట్ దాకా వెళ్లి , పీకల దాకా ఇరుక్కుపోయి..బయిటపడ్డ శింబు...ఇప్పుడు ఈ దర్శకుడుతో సినిమా ఓకే చేసి వార్తల్లో నిలిచాడు. మరి ఈ సినిమాలో ఏం రేంజి బూతు ఉంటుందో అంటున్నారు. అసలే ఈ మధ్యకాలంలో బూతు పాటతో సమస్యల్లో ఇరుక్కున్న శింబు ఈ ప్రాజెక్టు ఓకే చేయటం చర్చనీయాంశంగా మారింది.

Is Simbu's Next With Adhik Ravichandran?

పూర్తి వివరాల్లోకి వెళితే... శింబు, నయనతార జంటగా నటించిన ‘ఇదు నమ్మ ఆళు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తన తర్వాతి చిత్రంపై శింబు దృష్టి సారించారు. ‘త్రిష ఇల్లనా నయన్‌తార' చిత్ర దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో నటించడానికి కమిటైనట్లు సమాచారం.

ఈ చిత్రంలో శింబు మూడు వైవిధ్యమైన గెటప్ లతో కనిపించనుండగా ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిమిత్తం పలువురి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారని, చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చనున్నట్లు తెలిసింది.

శింబు చిత్రాలన్నిటిలోనూ ఇదే భారీ బడ్జెట్‌ సినిమాగా నిలవనుందని, ఆ స్థాయిలో చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

English summary
Simbu has signed his next project. If sources are to be believed, the actor will be working with director Adhik Ravichandran of Trisha Illana Nayanthara fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu