Just In
- 6 min ago
చివరి కోరిక అదే.. తీరకుండానే చనిపోయారు..నర్సింగ్ యాదవ్ భార్య కామెంట్స్
- 1 hr ago
విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్.. పాన్ ఇండియా కాదు.. అంతకుమించి!
- 1 hr ago
ఆచార్య టీమ్‌తో కలిసిన రామ్ చరణ్.. స్పెషల్ లుక్ రిలీజ్.. ఎలాంటి పాత్ర చేస్తున్నాడంటే..
- 2 hrs ago
KRACK box office: 7 రోజుల కలెక్షన్స్.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..?
Don't Miss!
- News
బీజేపి తోనే తెలంగాణ కల సాకారం అవుతుంది.!కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ ఉద్ఘాటన.!
- Finance
KYC పేరుతోనే అధిక ఫ్రాడ్స్, బ్యాంకు కస్టమర్లు జాగ్రత్త! SBI వీడియో అలర్ట్
- Sports
Gabba Test: వారెవ్వా వాటే బ్యాటింగ్.. శార్దుల్, సుందర్ హాఫ్ సెంచరీ!
- Automobiles
ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్లీ ప్రేమలో పడ్డ వనితా విజయ్ కుమార్.. నాలుగో పెళ్లికి కూడా సిద్ధమా? ఇంతకు ఎవరా వ్యక్తి?
తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి వ్యవహారం దక్షిణాది మీడియాలో రచ్చ చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేదు అనుభవాన్ని మిగిల్చిన నేపథ్యంలో పీటర్ పాల్ అనే తమిళ సినీ టెక్నిషియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం లాక్‌డౌన్ కాలంలో సంచలనం రేపింది. అయితే ఆ పెళ్లి ఎన్నో రోజులు కొనసాగకుండా మరోసారి విషాదాన్ని మిగిల్చింది. మూడో పెళ్లి మిగిల్చిన విషాదాన్ని దిగమింగి మళ్లీ ప్రేమలో పడిందనే విషయాన్ని వెల్లడిస్తూ...

పీటర్ పాల్‌తో మూడో పెళ్లి
పీటర్ పాల్‌తో మూడో పెళ్లి తర్వాత వనితా విజయ్ కుమార్‌పై తమిళ సెలబ్రిటీలు, నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. విడాకులు తీసుకోని పీటర్ పాల్‌ను ఎలా పెళ్లి చేసుకొన్నావు? ఓ మహిళ జీవితాన్ని, కాపురాన్ని కూల్చివేశావు అంటూ సెలబ్రిటీలు ఫైర్ అయ్యారు. పలువురు సెలబ్రిటీలతో వనితా సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తూ తన నిర్ణయాన్ని సమర్ధించుకొన్నారు.

మద్యానికి బానిస అవ్వడంతో
అయితే పీటర్ పాల్ తన రెండో పెళ్లి తర్వాత కూడా మారలేదు. గతంలో మాదిరిగానే పీకల్లోతూ మద్యం సేవిస్తూ ఆల్కాహాల్‌కు బానిసయ్యాడు. పెళ్లి తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లక్షల రూపాయాలు ఖర్చు చేసి పీటర్ ఆరోగ్యం మెరుగుపడేందుకు చర్యలు తీసుకొన్నారు. అయితే పీటర్‌లో మార్పు రాకపోవడంతో వెంటనే గుడ్‌బై చెప్పడంతో మూడో పెళ్లి కూడా విషాదంగా మారింది.

పీటర్ పాల్‌తో పెళ్లి తెగతెంపులు
గత నవంబర్ నెలలో పీటర్ పాల్‌తో తెగతెంపులు చేసుకొన్నానంటూ వనితా విజయ్ కుమార్ ప్రకటన చేయడం సంచలనం రేపింది. మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్‌కు క్షమాపణ చెప్పి మూడో పెళ్లిని క్యాన్సిల్ చేసుకొన్నారు. కానీ గతంలో ఎలిజబెత్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వనిత, పీటర్ పాల్‌ను కోర్టులో హాజరుకావాలని కొన్ని రోజుల క్రితం సమన్లు జారీ చేసింది.

నేను మళ్లీ ప్రేమలో పడ్డాను..
మూడో పెళ్లి వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలోనే వనిత విజయ్ కుమార్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టింది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. నీవు చాలా సంతోషంగా ఉన్నావని అనుకొంటా అంటూ తమిళ నటి ఉమ రియాజ్ ఖాన్‌ను ట్యాగ్ చేసి ఎ పోస్టు పెట్టింది. దాంతో నాలుగో పెళ్లికి సిద్దమైందా అంటూ నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లతో రెస్పాన్స్ వచ్చింది. దాంతో కామెంట్స్ బాక్స్‌ను బ్లాక్ చేయడం గమనార్హం.

నిజంగానే ప్రేమలో పడిందా?
అయితే వనితా విజయ్ కుమార్ నిజంగా మళ్లీ ప్రేమలో పడిందా? ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? సినిమా సెలబ్రిటీ లేదా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తా? లేక తన సహచర నటిని ఆటపట్టించడానికే అలా పోస్టు పెట్టిందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో లేస్తున్నాయి. అయితే వనితా విజయ్ కుమార్ క్లారిటీ ఇస్తేనే అసలు విషయం బయటకు వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.