యాక్టర్లు, నిర్మాతల ఇళ్లపై ఇన్‌కం టాక్స్ దాడులు

ఆదాయపు పన్ను శాఖ ఇన్వెస్టిగేషన్ విభాగం అడిషనల్ డైరెక్టర్ మురళి మెహన్ దాడులు జరిపిన విషయాన్ని ధృవీకరించారు. అయితే దీపావళి పండగ వేళ ఈ దాడులు నిర్వహించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట సినిమా విడుదల కార్యక్రమాల్లు పలువురు బిజీగా ఉన్న సమయంలో ఈ దాడులు జరుగడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
సినీయర్ అధికారి ఒకరు మాట్లాడుతూ....పలువు ఫిల్మ్ ఫ్రొడక్షన్ సంస్థలు పన్ను చెల్లించడంలో విఫలం అయ్యాయని, అందుకే ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. కొందరు బ్లాక్ మనీతో సినిమాలు నిర్మించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు సదరు అధికారి ఆరోపించారు.
చెన్నైలో 30 ప్రదేశాలతో పాటు హైదరాబాద్‌లో ఒక చోట దాడులు నిర్వహించారు. అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజంతా సోదాలు నిర్వహించి లెక్కలు తేల్చనున్నారు. కమెడియన్ సంతానం, నిర్మాతలు ఎఎం రత్నం, ఆర్ బి చౌదరి, జ్ఞానవేల్ రాజా ఇళ్లపై దాడులు నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. ఈ దాడుల్లో దాదాపు 50 మంది అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











