»   » నయనతార పై "ఫిజికల్ దాడి"...! నిర్మాతల సిండికేట్ ఈ నిర్ణయానికి అర్థమేమిటి??

నయనతార పై "ఫిజికల్ దాడి"...! నిర్మాతల సిండికేట్ ఈ నిర్ణయానికి అర్థమేమిటి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది టాప్‌ హీరోయిన్‌ నయనతార ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ సంచలనమే. మొదట శింబు, ఆ తర్వాత ప్రభుదేవతో ఆమె నడిపిన ప్రేమ వ్యవహారాలు ఎంత సెన్సేషన్‌ సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె తాజాగా తమిళ డైరెక్టర్‌ విఘ్నేశ్‌తో లవ్‌ట్రాక్‌ నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్‌ హీరో సూర్యతో ఓ సినిమా చేసే ఛాన్స్‌ కూడా విఘ్నేశ్‌కు ఇప్పించిందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఇప్పుడు వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌. ప్రస్తుతం చెన్నైలోని ఎగ్మూర్‌లో ఇద్దరూ కలిసే జీవిస్తున్నారట. ఇటీవలె నయనతార అక్కడ ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందట. ఆ ఫ్లాట్‌లో విఘ్నేశ్‌తో కలిసి కాపురం కూడా పెట్టేసిందట. నిజానికి నయనతార, విఘ్నేశ్‌ల పెళ్లి ఈ ఏడాది మేలోనే అయిపోయిందని, ఇప్పుడు కాపురం పెట్టారని తమిళ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నయనతారతో రిలేషన్‌ బాగా పర్సనల్‌ అని, అది బయటకు చెప్పేది కాదని విఘ్నేశ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

It's confirmed, Nayanthara is dating Vignesh Sivan

అయితే ఈ వ్యవహారం కన్నా హాట్ టాపిక్ ఇంకొకటి ఉంది ప్రస్తుతం దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3కోట్లు అందుకుంటున్న నయన్... పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చాలా చిక్కుల్లో పడింది. దానికి కారణం తన పారితోషికంలో సగంపైగా తీసుకునేది బ్లాక్‌లో కాబట్టి. దీంతో ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల కోసం తీసుకున్న పారితోషికాన్ని వైట్‌గా మార్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం ఆయా సినిమాల నిర్మాతలపైనే ఆధారపడింది నయన్. ఆ నిర్మాతల నుంచి తాను తీసుకున్న డబ్బును తిరిగి వాళ్లకే ఇచ్చి దాన్ని వైట్‌గా మార్చుకొని రావాలని హుకుం జారీ చేసింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ నిర్మాతలు నయన్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగా తమ సినిమాల్లో నయన్ స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని ఆయా చిత్రాల దర్శకులకు కోరుతున్నారు నిర్మాతలు. సగం సినిమా పూర్తయిన పరవాలేదని, నయన్‌ని మాత్రం మార్చాలని కోరుతుండడం, దానికి దర్శకులు ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక అల్లాడుతున్నారు నిర్మాతలు. అయితే, తాజాగా కొందరు అగ్ర నిర్మాతలు కలిసి ఈ వ్యవహారంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నయన్‌కు ఫిజికల్‌గా బుద్ధి చెప్పాలని సిండికేట్‌గా తయారైనట్లు కోలీవుడ్ సమాచారం. అయితే, ఇక్కడ ఫిజికల్ ఎటాక్ అంటే దాడి చేయించడమా లేక అవినీతి అధికారులకు నయన్ గురించి ఉప్పందించి ఆమెపై దాడి చేయించడమా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

English summary
Tamil producers angry with Nayanatara remuneration, the Top producers syndicate is getting ready to tack an action on Nayanatara
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu