»   » అబ్బే...అవన్నీ ఫేస్ బుక్ లో పుట్టిన రూమర్సే

అబ్బే...అవన్నీ ఫేస్ బుక్ లో పుట్టిన రూమర్సే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఫేస్ బుక్, ట్విట్టర్ లు రెండూ వేగం పుంజుకున్న తర్వాత...రూమర్స్ కూడా అంతే వేగంగా ప్రయాణం చేస్తున్నాయి. దాంతో సినీ సెలబ్రెటీలు ఎప్పుడూ వీటిపై ఓ కన్నేసి...ఎప్పుడు తమ మీద వార్తలు వస్తున్నాయో..అవి పాజిటివో..నెగిటివో..రూమరో చూసుకోవాల్సిన భాధ్యత పడింది. అవసరమైతే ఖండిచాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా 'తల' అజిత్‌ ఇటీవల రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ ఐ8 కారును కొనుగోలు చేసినట్లు సోషల్‌ నెట్‌వర్క్‌లలో జోరుగా ప్రచారం మొదలైంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ వార్తకు తోడుగా... ఇటీవల వడపళని ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు ఫొటోలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే అజిత్‌ కొన్న కొత్తకారంటూ కొన్ని మీడియాలలో వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అజిత్‌ తరఫు వర్గాలు స్పందించాయి.

సోషల్‌ మీడియాలో వస్తున్న కొత్త కారుకు, అజిత్‌కు ఏ మాత్రం సంబంధం లేదని ఆయన మేనేజరు వివరణ ఇచ్చారు. భారీ విలువైన కారును అజిత్‌ కొన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. అలాంటి నిరాధారమైన, సత్యదూరమైన వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన కోరారు.

It’s not Ajith’s BMW i8

సినిమాల విషయానికి వస్తే...

నటుడు అజిత్ 56వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆరంభం, వీరం, ఎన్నైఅరిందాల్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. ఆయనతో ఇంతకు ముందు ఆరంభం,ఎన్నైఅరిందాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసాయిరాం క్రియేషన్స్ అధినేత ఎఎం రత్రం మూడోసారి నిర్మిస్తున్న చిత్రం ఇది.

అదేవిధంగా ఇంతకుముందు అజిత్ హీరొగా వీరం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివ మరోసారి ఆయనతో కలిసి ఈ చిత్రంలో పని చేయనున్నారు. ఈచిత్రంలో అజిత్ సరసన క్రేజీ నటి శ్రుతీహాసన్ నటించనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం. అయితే చిత్రవర్గాలు ఈవిషయాన్ని ద్రువీకరించలేదన్నది గమనార్హం.కాగా ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత భాణీలందించనుండటం మరో విశేషం.

It’s not Ajith’s BMW i8

అలాగే... అజిత్ హీరోగా నటించిన ఎన్నై ఆరిందల్ సినిమాలో త్రిష, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమా ఎంతవాడు గానీ పేరుతో డబ్ అవుతోంది. అయితే... కోలీవుడ్ లో ఇప్పటికే సూపర్ హిట్ గా డిక్లేర్ అయిన ఈ చిత్రానికి అప్పుడే సీక్వెల్ ను చెక్కేసే పనిలో పడ్డాడట గౌతమ్ మీనన్. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించడం మరో విశేషం.

ప్రస్తుతం శింబు హీరోగా అచ్చం ఎన్ బదు మడమైయడ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న గౌతమ్ మీనన్... ఈ సినిమా పూర్తవుతూనే.. ఎన్నై ఆరిందల్ కు సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నట్లు స్పష్టం చేశాడు. అంతేకాదు... సినిమాలోని అజిత్ నటనకు ఫిదా అయిపోయిన గౌతమ్... సీక్వెల్ లోనూ అతడితోనే కలసి పనిచేయనున్నట్లు వెల్లడించాడు. ఇక... హాలీవుడ్ లో ఓ సినిమాను తెరకెక్కించే అవకాశమే వస్తే... అజిత్ నే హీరోగా పెట్టి ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తానని చెబుతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. మరి ఈ విజయవంతమైన కాంబినేషన్ ముందు ముందు ఇంకెన్ని మ్యాజిక్ లు చేస్తుందో చూడాలి.

English summary
The news on Hero Ajithkumar‬ and the so called BMW‬ is ‎absolutefalse‬ . pls ignore the news and stop spreading.The internet has been raging today about Thala Ajith’s brand new BMW I 8. Images show a white car in different angles and millions of fans have started sharing them with the belief that it is their idol’s car. Ajith’s personal PRO, who has confirmed that the images doing the rounds are not of Thala Ajith’s car. Anyway some unknown person’s car has enjoyed such popularity in such a short time just by using the tag of Thala Ajith.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu