»   » విడాకులు వచ్చేసాయ్.... ఆమె ఇప్పుడు సౌందర్య రజినీకాంత్

విడాకులు వచ్చేసాయ్.... ఆమె ఇప్పుడు సౌందర్య రజినీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిజినెస్ మ్యాన్ అయిన అశ్విన్ రామ్ కుమార్ ను 2010లో పెళ్లాడింది సౌందర్య. ఐతే కొన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 'కోచ్చడయాన్' సినిమా తీసినప్పటి నుంచి సౌందర్య తండ్రి దగ్గరే ఉంటోంది. ఏడాదిగా అయితే భర్తను అస్సలు కలవలేదు. పెళ్లయ్యాక సౌందర్య అశ్విన్ అని పేరు మార్చుకున్న సౌందర్య.. కొంత కాలంగా ఒకప్పట్లాగా సౌందర్య అశ్విన్ రామ్ కుమార్ గా మారిన ఆమె మళ్ళీ సౌందర్య రజినీకాంత్ అని పెట్టుకుంటోంది. దీన్ని బట్టే ఏదో తేడా వచ్చిందన్న విషయం జనాలకు అర్థమైంది. ఆమె విడాకుల గురించి కొన్ని నెలలుగా వస్తున్న రూమర్లు నిజమేనని ఇప్పుడు తేలిపోయింది.

కొన్నాళ్ళ కిందటే'నా వైవాహిక జీవితంపై వస్తున్న వార్తలు నిజమే. మేం గత ఏడాదిగా విడిగానే ఉంటున్నాం. విడాకుల చర్చలు నడుస్తున్నాయి. నా కుటుంబం ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుకుంటున్నా' అంటూ అఫీషియల్ గానే అనౌన్స్ చేసేసింది సౌందర్య. ఒక్క మాటతో తన జీవితంపైనా.. రజినీ చుట్టూ జరుగుతున్న ప్రచారానికి సమాధానం ఇచ్చింది.

It's official: Rajni's daughter confirms divorce

ఇప్పుడు ఈ విడాకుల తంతు ముగిసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కోర్టులో డైవర్స్ ఫైల్ చేసిన సౌందర్య.. అశ్విన్ తాజాగా కోర్టుకు కూడా హాజరయ్యారు. జడ్జి వీరికి విడాకులు మంజూరు చేసినట్లే అని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయాన్ని సౌందర్య అఫీషియల్‌గా ప్రకటించబోతోందట. తన కూతురి వైవాహిక జీవితాన్ని నిలబెట్టడానికి రజినీ గతంలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని సమాచారం.

ఆ తర్వాతే విడాకుల ప్రక్రియ కూడా మొదలైంది. అశ్విన్ తో కలిసి ఉండగా తండ్రితో 'కోచ్చడయాన్' సినిమా చేసిన సౌందర్య.. ఇప్పుడు తన బావ ధనుష్ హీరోగా 'వీఐపీ-2' సినిమా చేయబోతోంది. ఇటీవలే రజినీ చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే.

English summary
"News about my marriage is true. We have been separated for over a year & divorce talks are on. I request all to respect my family's privacy", tweeted Soundarya a Days ago. and Now the reports says that divers process completed
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu