For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'కడలి' హీరో కొత్త సినిమా మొదలైంది

  By Srikanya
  |
  Gautham Karthik
  చెన్నై : '3' చిత్రం ద్వారా మెగాఫోన్‌ పట్టుకున్నస్టార్ హీరో ధనుష్‌ భార్య ఐశ్వర్య తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఆమె తెరకెక్కిస్తున్న సినిమా 'వై రాజా వై'. మణిరత్నం తాజా చిత్రం 'కడలి'తో పరిచయమైన గౌతం కార్తిక్‌ హీరో. గౌతమ్ కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణను గురువారం ప్రారంభించారు. దర్శకులు బాలా, వెట్రిమారన్‌, శరవణన్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్‌కొట్టారు.

  గౌతంకార్తిక్‌, హీరోయిన్ ప్రియా ఆనంద్‌, వివేక్‌, దర్శకుడు ఎస్‌ఎం వసంత్‌, శ్రీరంజనిలకు సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై తెరకెక్కుతోంది. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. శుక్రవారం నుంచి చెన్నైలో చిత్రీకరణ కొనసాగుతుందని యూనిట్‌ పేర్కొంది.


  '3' చిత్రం ద్వారా తన భర్తను హీరోగా చేసి దర్శకత్వం వహించారు ఐశ్వర్య. దర్శకురాలిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు రెండో సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను కూడా పూర్తి చేసింది. ధనుష్‌ను హీరోగా అనుకున్నా.. ప్రస్తుతం ఆయన ఇతర చిత్రాల్లో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం వెతుకులాటలో పడింది ఐశ్వర్య. అలా తన కన్ను నటుడు కార్తీక్‌ కుమారుడు గౌతంపై పడింది.

  ఈ సినిమా కథ కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్టు తెలిసింది. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నాడు. తొలి చిత్రం ద్వారా సంపూర్ణ విజయాన్ని అందుకోని ఐశ్వర్య.. ఈ సినిమాతో ఆ కల నెరవేర్చుకుంటారేమో వేచిచూడాలి. మరో ప్రక్క డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న '3'రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఈ చిత్రం త్వరలో హిందీలో తెరకెక్కనుంది. నిఖిల్ అద్వానీ ఈ చిత్రం రీమేక్ చేయనున్నారు. హిందీ నేటివిటీకోసం కొన్ని మార్పులు చేస్టున్నట్లు చెప్తున్నారు. అలాగే '3'లో నటనతో ఆకట్టుకున్న శ్రుతిహాసన్‌ హిందీలో రీమేక్‌లోనూ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

  ధనుష్‌ హీరోగా ఆయన భార్య ఐశ్వర్య తెరకెక్కించిన చిత్రం '3'. అందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్‌ నటించింది. చిత్ర విడుదలకు ముందే 'వై దిస్‌ కొలవెరి డి' పాట సంచలనం సృష్టించటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అత్యధిక కేంద్రాల్లో చిత్రం విడుదలైంది. వూహించిన ఫలితం దక్కలేదు. నటిగా శ్రుతిహాసన్‌ మంచి మార్కులు మాత్రం కొట్టేసింది.తెలుగులో సైతం ఈ చిత్రం మొదటి రోజే పెద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుని చతికిలపడింది. రైట్స్ కొనుక్కున్న నిర్మాత నట్టికుమార్ ని నట్టేట ముంచేసింది.

  English summary
  Actor Gautham Karthik, who turned 24 Thursday, is busy shooting for upcoming Tamil romantic-comedy "Vai Raja Vai". "He celebrated his birthday with family and close friends last (Wednesday) night and joined the crew for shoot this Thursday) morning. An important scene featuring Gautham has been canned," a source from the film's unit told Media. Directed by Aishwarya Dhanush, "Vai Raja Vai" went on floors here Thursday. It also features Priya Anand and Satish in important roles. AGS Entertainment is producing the film, which has music by Yuvan Shankar Raja. Meanwhile, Karthik is simultaneously shooting for Tamil films "Sippai" and "Ennamo Yedho".
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more