»   » త్రీడిలో రజనీకాంత్ ఫైట్స్ అదుర్స్

త్రీడిలో రజనీకాంత్ ఫైట్స్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సైంటిస్టు రజనీ, రోబో రజనీల మధ్య ఇటీవల 3డీ పరిజ్ఞానంతో ఫైటింగ్ సీన్స్ షూట్ చేసారు. అవి తప్పకుండా ప్రేక్షకుల్ని మైమరపిస్తాయిని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే చిత్రంలోని ప్రతి సన్నివేశం వేగంగా, ఉత్కంఠతను కలిగించేలా సాగుతుంది. స్టాన్‌ విన్‌స్టన్‌ స్టూడియోలో 'రోబో'కి సంబంధించిన స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ పనులు జరుగుతున్నాయని రోబో చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక 'జురాసిక్‌ పార్క్‌', 'టెర్మినేటర్‌', 'ఐరన్‌మేన్‌', 'అవతార్‌' వరకు పలు చిత్రాలకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను సమకూర్చింది స్టాన్‌ విన్‌స్టన్‌ స్టూడియోనే. అక్కడ 'రోబో'కి స్పెషల్ ఎఫెక్ట్స్‌ రూపొందిస్తూండటంతో మరింత హైప్ ఈ చిత్రంపై ఏర్పడుతోంది.

రజనీకాంత్‌, శంకర్ ‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం 'రోబో'. 'శివాజీ' తరవాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ఐశ్వర్య రాయ్‌ నాయిక. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అలాగే ప్రస్తుత రాజకీయాలు, వర్తమాన విషయాల గురించి శాస్త్రవేత్త రజనీ పాత్ర ద్వారా ఆసక్తికర సంభాషణలు పలికిస్తున్నారని వినిపిస్తోంది. ఇక 'టెర్మినేటర్‌'లో అర్నాల్డ్‌ స్వార్జ్‌నెగర్‌ నగ్నంగా కనిపించే సన్నివేశం ఉంటుంది. దాన్ని పోలిన సన్నివేశాన్ని రజనీకాంతఫై చిత్రించారని చెన్నై సినీ వర్గాల సమాచారం. రకరకాల విశేషాలతో రూపొందుతోన్న రోబో చిత్రంపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఇంతకు ముందు రజనీ, శంకర్ కాంబినేషన్లో వచ్చిన శివాజీ చిత్రం ఘన విజయం కూడా ఈ రోబో క్రేజ్ కు తోర్పడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X