For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆదరిస్తే తమిళంలో స్థిరపడతా: జగపతిబాబు

  By Srikanya
  |

  చెన్నై : ప్రేక్షకులు ఆదరిస్తే కోలీవుడ్‌లో స్థిరపడతానని ప్రముఖ తెలుగు హీరో జగపతి బాబు అన్నారు. ఈయన తెలుగులో నటిస్తూనే ఇతర భాషల చిత్రాల్లో నటించడానికి మక్కువ చూపుతున్నారు. ఇటీవల శివ తాండవం చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా పుత్తగం చిత్రంలో పోలీస్ అధికారిగా ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. రామ్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ వి.రామదాస్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ బుల్లి తెర నటుడు విజయ్ ఆదిరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు ఆర్య తమ్ముడు సత్య, సంజయ్ భారతి, రక్షణ మౌర్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జేమ్స్ వసంత్ సంగీత బాణీలు కట్టారు.

  జగపతి బాబు మాట్లాడుతూ తాను ఇక్కడే పుట్టి పెరిగిన వాడినన్నారు. తాను హీరోగా పరిచయమైన రోజుల్లోనే సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రలో నటించాలని దర్శకుడు పి.వాసు అడిగినప్పు డు ఎనలేని సంతోషం కలిగిందని తెలిపారు. తాండవం చిత్రం తరువాత కోలీవుడ్‌లో నటిస్తున్న రెండవ చిత్రం ఈ పుత్తగం అని పేర్కొన్నారు. దర్శకుడు విజయ్ ఆదిరాజ్ యూనిట్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దిందన్నారు. కోలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తే ఇక్కడే స్థిరపడతానని జగపతిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటీమణులు రాధిక, సుహాసినీ జగపతి బాబు గ్లామర్‌ను ప్రశంసించారు.

  మరో ప్రక్క జగపతిబాబు నటించిన 'ఆపరేషన్‌ దుర్యోధన 2'చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. రాజకీయ చదరంగంలో గెలుపు ఎప్పుడు ఎవర్ని వరిస్తుందో చెప్పలేం. పదవి కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూనే ఉండాలి. ముఖ్యమంత్రి పీఠం కోసం కొన్ని అరాచక శక్తులు కుట్ర పన్నుతాయి. వాటిని ఓ పోలీసు అధికారి ఎలా భగ్నం చేశాడో మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు నందం హరిశ్చంద్రరావు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'ఆపరేషన్‌ దుర్యోధన 2'. జగపతిబాబు హీరోగా నటించారు.

  'ఆపరేషన్‌ దుర్యోధన 2' లో రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఎ.బి.శ్రీనివాస్‌, జిట్టా సురేందర్‌ రెడ్డి నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన రాజకీయాల నేపథ్యంగా సాగే చిత్రమిది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. తన పాత్రకి ఏరాసు ప్రతాప్‌రెడ్డి స్వయంగా సంభాషణలు చెప్పారు. ఈ నెల 19న పాటల్ని, నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు. సోనియా అగర్వాల్‌, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌, కత్తి కార్తీక తదితరులు నటిస్తున్నారు. సంగీతం: శ్రీలేఖ.

  జగపతిబాబు తాజా చిత్రం 6 కూడా డిజాస్టర్ అయ్యింది. . ప్రస్తుతం తెలుగులో ఏప్రియల్ ఫూల్', 6, ఆపరేషన్ దుర్యోధన2 చిత్రాలు చేస్తున్నాడు. కన్నడలో సుదీప్ హీరోగా చేస్తున్న చిత్రంలో ఇన్వెస్టిగేటీవ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రాలతో పాటు తమిళంలో మరో సినిమా చేయబోతున్నారు. అది నవంబర్ 24న మొదలవుతుంది.

  English summary
  
 Jagapathi Babu recent stunt as a villain in Vikram's 'Siva Thandavam' too tanked at Box Office. To beat the odds, Jagapathi has now taken the route to settle in Kollywood. Reports have that Jagapathi is ready to do any role including a hero, villain, side-character and anything if he is paid 5 lakhs per day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X