»   » వివాదాల తెలుగు హీరోయిన్, సైలెంట్ హీరో : డిసెంబర్‌లో పెళ్లి, పక్కా సమాచారమే

వివాదాల తెలుగు హీరోయిన్, సైలెంట్ హీరో : డిసెంబర్‌లో పెళ్లి, పక్కా సమాచారమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో జై, తెలుగు హీరోయిన్ అంజలి మధ్య ఏదో ఉందని.. త్వరలోనే తమిళబ్బాయి, తెలుగమ్మాయి ఒక్కటి కాబోతారనే పుకార్లు గత కొద్దిరోజులుగా జోరందుకున్నాయి. షాపింగ్ మాల్ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే వాళ్లిద్దరూ తమ మధ్య ఏమీ లేదని స్నేహం మాత్రమేనని పైకి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు.

తమిళ హీరో జై, హీరోయిన్‌ అంజలి

తమిళ హీరో జై, హీరోయిన్‌ అంజలి

ఈ ఇద్దరి మధ్యా ఉన్న అనుబంధాన్ని ఓ దోశ తమిళ హీరో జై, హీరోయిన్‌ అంజలి మధ్య ప్రేమని బయటపెట్టింది. తమిళంలో జ్యోతిక నటించిన 'మగలిర్‌ మట్టుమ్‌' సినిమా ప్రమోషన్‌ కోసం ఆమె భర్త, హీరో సూర్య 'దోశ ఛాలెంజ్‌'ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. ఈ ఛాలెంజ్‌కి స్పందించిన తమిళ హీరో జై, ఇంట్లో దోశ వేశాడు.

అంజలి కోసమే

అంజలి కోసమే

ఆ దోశ వేసింది ఎవరి కోసమో కాదు, అంజలి కోసమే. జై, తనకోసం ప్రేమతో దోశ వేయడాన్ని తెగ ఎంజాయ్‌ చేసేసినట్టు బయట పడిపోయింది అంజలి. ఆ పోస్ట్ తోనే ఈ ఇద్దరి మధ్యా ఏదో ఉందీ అని తెలిసి పోయినా అప్పటికీ ఖచ్చితమైన క్లారిటీ మాత్రం ఇవ్వక పోవటం తో సంధిగ్ధం లోనే ఉండిపోయారు జనం....

ముద్దుపేరుతో అంజు అని సంభోదిస్తూ

ముద్దుపేరుతో అంజు అని సంభోదిస్తూ

జూన్16న అంజలి పుట్టిన రోజు. బర్త్ డే విషెస్ చెబుతూ జై పోస్ట్ చేసిన సందేశం అందర్నీ ఆకట్టుకుంది. అంజలిని ముద్దుపేరుతో అంజు అని సంభోదిస్తూ.. " నువ్వు నాకు ఎంతో స్పెషల్.. నీ పుట్టిన రోజు కూడా అంతే ప్రత్యేకం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీవెంటే వుంటా.. హ్యాపీ బర్త్ డే" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన అంజలి మురిసిపోయింది. జై ట్వీట్‌కు "నాతో ఉన్నందుకు థ్యాంక్స్.. నువ్వెప్పుడు నాతో ఉంటావని ఆశిస్తున్నా" అని రీ-ట్వీట్ చేసింది.

చెవులు కొరుకున్నారు

చెవులు కొరుకున్నారు

అయితే వీరిద్దరి మధ్య ట్విట్టర్‌లో జరిగిన సంభాషణ హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య ఇన్ని రోజులు ప్రేమ లేదనుకున్నాం కానీ.. తాజా ట్వీట్లతో అంజలీ, జై ఇద్దరూ తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పకనే చెబుతున్నారంటూ నెటిజన్లు చెవులు కొరుకున్నారు. ఇక అసలు విషయం ఎప్పుడు చెప్పేస్తారా అని ఎదురు చూసారు.

పెళ్లి గురించి ఆసక్తికరమైన వార్త

పెళ్లి గురించి ఆసక్తికరమైన వార్త

అయితే ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ‘బెలూన్‌'లో జంటగా నటిస్తున్న వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం, ఒకరి కోసం ఒకరు చేస్తున్న పనులు చూసి ఇద్దరూ లవ్‌లో ఉన్నారని అందరూ ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో జై, అంజలి పెళ్లి గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. వీరిద్దరూ వచ్చే డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఆ జంటే నోరు విప్పాలి మరి.

English summary
Actress Anjali who has been maintaining live-in relationship with Kollywood actor Jai has informed the close circle of friends that they would get married in December this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu