Oscars nomination 2022 జై భీమ్ మూవీకి దక్కని గౌరవం.. నిరాశలో సూర్య ఫ్యాన్స్!
దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినీ విమర్శకులు మెప్పించిన చిత్రం జై భీమ్. దళిత మహిళ న్యాయ పోరాటానికి మద్దతు తెలిపిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కీలక సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అడ్వకేట్ చంద్రుగా విలక్షణ నటుడు సూర్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.
అయితే ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం భారతదేశం నుంచి ఎంపికైంది. అయితే నామినేషన్ల తుది జాబితాలో జై భీమ్ చోటు సంపాదించలేకపోయింది. దాంతో భారతీయ సినిమా అభిమానులు నిరాశ చెందారు. ఈ సినిమాకు నామినేషన్‌లో చోటు లభిస్తుందని చాలా మంది సినీ అభిమానులు, మీడియా దేశవ్యాప్తంగా ఎదురు చూశారు.

అయితే ఆస్కార్స్ నామినేషన్ల ప్రక్రియకు ముందు అంతర్జాతీయ సినిమా వెబ్‌సైట్ రాటెన్ టామెటాస్ ఎడిటర్ జాక్వలైన్ సానుకూలంగా స్పందించారు. ఆస్కార్ నామినేషన్ల రేసులో జై భీమ్ ముందు ఉంది. ఉత్తమ చిత్రంగా జై భీమ్ నామినేషన్ సంపాదించే అవకాశం ఉంది. మీరు నన్ను నమ్మండి.. ఈ సినిమాకు మంచి గౌరవం దక్కుతుందని అన్నారు. అయితే చివరి జాబితాలో జైభీమ్ లేకపోవడంతో అందరూ నిరాశకు గురి అవుతున్నారు. అవార్డుల నామినేషన్ ప్రకటన కార్యక్రమం మొదలైన తర్వాత మీడియా, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు.
లాక్‌డౌన్ కారణంగా థియేటర్ల మూసివేతతో జై భీమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. విమర్శకులు, సినీ అభిమానులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.
నటీనటులు: సూర్య, లిజోమోల్ జోస్, మణికందన్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ తదితరులు
రచన, దర్శకత్వం: టీజే జ్ఞానవేల్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య
సినిమాటోగ్రఫి: ఎస్ఆర్ కథిర్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్: సీన్ రోల్డాన్
ప్రొడక్షన్ కంపెనీ: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2021-11-02


Click it and Unblock the Notifications











