»   » కేన్స్ లో సౌత్‌ నుంచి తొలి అడుగు : బాహుబలిని మించి, సినిమా ఓపెనింగే కేన్స్ లో

కేన్స్ లో సౌత్‌ నుంచి తొలి అడుగు : బాహుబలిని మించి, సినిమా ఓపెనింగే కేన్స్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ 17 నుంచి 28 వరకూ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ప్రతి ఏడాది కాన్స్‌కి పలువురు హిందీ హీరోయిన్లు హాజరవుతారు. అయితే... ఓ సినిమా ప్రారంభోత్సవం నిమిత్తం కాన్స్‌ వెళ్తున్నది మాత్రం శ్రుతీనే. కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌ మీద మెరిసే ఫస్ట్‌ సౌత్‌ హీరోయిన్‌ కూడా ఈమేనని సమాచారం.

శృతి యువరాణిగా

శృతి యువరాణిగా

సౌత్ ఇండస్ట్రీలో ఓ భారీ బడ్జెట్ చిత్రం సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనుంది. జయం రవి, ఆర్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంఘమిత్ర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో శృతి యువరాణిగా నటించనుండగా, ఆ పాత్ర కోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టింది.ఈ చిత్రాన్ని కేన్స్ లో లాంచ్ చేయనున్నట్టు సమాచారం.

సంఘమిత్ర

సంఘమిత్ర

ఇప్పుడు శృతి హాసన్ కత్తి పోరాటాలు నేర్చుకుంటోంది.. అదీ లండన్‌లో. ఎందుకు? ‘బాహుబలి' కన్నా గొప్పగా, గ్రాండ్‌గా ... ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నాం అని డైరెక్టర్ సీ.సుందర్ ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ ఎపిక్ సినిమా పేరు ‘సంఘమిత్ర'. అందులో శృతి హాసన్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

ఫ్రాన్స్‌లో 70వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్

ఫ్రాన్స్‌లో 70వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్

ఈ సినిమాని ఫ్రాన్స్‌లో 70వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా లాంచ్ చెయ్యదలచుకున్నారు. అందుచేత హీరోలు జయం రవి & ఆర్య, శృతి హాసన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఫ్రాన్స్‌కి వెళ్ళనున్నారు. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ‘బాహుబలి' ని మించి నిలచిపోయేలా తీయాలని మేకర్స్ లక్ష్యం.

విద్యాబాలన్‌ సౌతిండియన్‌

విద్యాబాలన్‌ సౌతిండియన్‌

ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా చరిత్రలోనే కేన్స్ కోసం వెళ్ళిన సౌత్ హీరోయిన్లు లేరనే చెప్పాలి. డర్టీ బ్యూటీ విద్యాబాలన్‌ సౌతిండియన్‌ అయినప్పటికీ హిందీ నటిగానే కాన్స్‌కి వెళ్లారు. సౌత్‌లో హీరోయిన్‌గా సెటిల్‌ అయిన బ్రిటన్‌ బ్యూటీ అమీ జాక్సన్‌ సైతం గతేడాది ఫారిన్‌ సంస్థ ప్రచారం నిమిత్తం కాన్స్‌ వెళ్లారు.

రెండు వందల కోట్ల బడ్జెట్‌

రెండు వందల కోట్ల బడ్జెట్‌

ఈ ఏడాది ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఇండో-బ్రిటన్‌ సినిమా ప్రచారం కోసం వెళ్తారట. తెలుగు, తమిళం, హిందీ... శ్రుతీహాసన్‌ మూడు భాషల ప్రేక్షకులకు పరిచయమే. శ్రుతి కథానాయికగా తమిళ దర్శకుడు సుందర్‌. సి మూడు భాషల్లోనూ ‘సంఘమిత్ర' అనే భారీ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ నటులు ఆర్య, ‘జయం' రవి హీరోలుగా సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రారంభం కానుంది.

English summary
Shruti Haasan will make her debut at the Cannes Film Festival this year. She will be seen walking the red carpet on the opening night on May 18 to unveil her period film in which she plays a warrior princess.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu