For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జయప్రద కుమారుడి లాంచింగ్ చిత్రం టీజర్(వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్: అలనాటి అందాల హీరోయిన్ జయప్రద కుమారుడు సిద్దార్ద్ హీరో గా తమిళనాట లాంచ్ అవుతన్నారు. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం టైటిల్ ఉయిరే ఉయిరే. ఈ చిత్రం తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ఇష్క్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం ద్వారా సిద్దార్ద్ లాంచ్ అవుతున్నారు. ఈ సినిమాకు జయప్రద సన్నిహితుడు అమర్ సింగ్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహిస్తున్నారు. ఆ టీజర్ మీరూ చూడండి..

  ఈ చిత్రంలో అజయ్...నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.డి రాజశేఖర్ కెమెరావర్క్ అందిస్తున్నారు. జయప్రద తమ స్టూడియో 9 బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ రాజశేఖర్ డైరక్ట్ చేస్తన్నారు. గతంలో రాజశేఖర్ దర్సకత్వంలో విశాల్ హీరోగా సెల్యూట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

  'ఇష్క్‌' సినిమా విషయానికి వస్తే 11 సెంటర్స్‌లో ఈ సినిమా 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. బి,సి సెంటర్లు ఎలా ఉన్నా ఎ సెంటర్లలో బాగా వర్కవుట్ అయ్యింది. ఫ్యామీలీలు వీకెండ్ లలో ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపారు. కాలేజీ యూత్ కూడా ఈ చిత్రానికి బాగా రావటంతో ఎగ్జిబిటర్స్ బాగా లాభపడ్డారు. అలాగే సీడెడ్ లో ఇప్పటివరకూ ఏ నితిన్ చిత్రానికి రానీ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి.

  Jayaprada's Son debut film!

  చిత్రం కథేమిటంటే...ఎప్పుడూ సరదాగా నవ్వుతూ,నవ్విస్తూ తిరిగే రాహుల్(నితిన్)కి ప్లైట్ ప్రయాణంలో ప్రియ(నిత్య మీనన్)పరిచయమవుతుంది. అక్కడనుంచి అనుకోని పరిస్ధితుల్లో ప్లైట్ గోవాలో ల్యాండ్ అయ్యి వీరి పరచయాన్ని ప్రేమగా మార్చేస్తుంది. ఇద్దరూ అలా ప్రేమలో మునిగి తేలుతుండగా ప్రియ అన్న సూర్య(అజయ్)ద్వారా ట్విస్ట్ పడుతుంది. సూర్య గతంలో రాహుల్ అక్క(సింధు మీనన్)ని ప్రేమించమని టార్చర్ పెట్టి.. రాహుల్ చేతిలో దెబ్బ తిని ఉంటాడు. ఆ దెబ్బ మనస్సులో పెట్టుకున్న వీరి ప్రేమ కథను ఏమి మలుపు తిప్పుతాడు..ఎలా రాహుల్, ప్రియలు ఒకటయ్యారు అనేది మిగతా కథ.

  నితిన్‌ మాట్లాడుతూ 'నా కెరీర్‌లో 'సై' సినిమా అనంతరం మళ్లీ అంతటి జెన్యూన్‌ హిట్‌టాక్‌ 'ఇష్క్‌' చిత్రానికి లభించింది. మౌత్‌టాక్‌ ద్వారా ఈ సినిమా చాలా బాగుందన్న సమాచారం ఎక్కువమందికి రీచ్‌ అయింది. క్లాస్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చింది. నా కెరీర్‌లో 'ఇష్క్‌' బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు వర్క్‌ చేసిన ప్రతి టెక్నీషియన్స్‌కు ధన్యవాదాలు. అందరికీ మంచి పేరు, గుర్తింపును 'ఇష్క్‌' తీసుకువచ్చిందని' అన్నారు.

  నిత్యమీనన్‌మాట్లాడుతూ నేనే ఈ సినిమా సక్సెస్‌ సాధిస్తుందని ముందే ఊహించాను. చిత్రీకరణ జరుగుతున్నప్పుడే విజయంపై మా అందరికీ పూర్తి నమ్మకం కలిగింది. అయితే ఈ రోజు మా అంచనాలను మించి విజయాన్ని అందుకోవటం విశేషం. తెలుగువారం దరికీ నా ధన్యవాదాలన్నారు.

  English summary
  The theatrical trailer Tamil flick 'Uyire Uyire' starring Siddhu (Jayaprada's Son) and Hansika has been unveiled. This film is an official remake of Nithin and Nithya Menon starrer 'Ishq' directed by Vikram Kumar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X