»   » శంకర్ సార్ వల్లే నేనీ స్టేజీలో... ఐశ్వర్యా రాయ్

శంకర్ సార్ వల్లే నేనీ స్టేజీలో... ఐశ్వర్యా రాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పబ్లిక్ పంక్షన్స్ కి ఎప్పుడోకాని అటెండ్ కాని ఐశ్వర్యా రాయ్ తాజాగా చెన్నైలోని ఓ ఆడియో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా అటెండయింది. Rettaisuzhi అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాత కావటంతో ఈ విశేషం చోటుచేసుకుంది. అలాగే ఈ చిత్రం ప్రధానపాత్రల్లో ప్రముఖ దర్శకులు కె బాలచందర్, భారతీరాజా కలిసి నటించటం మరో అద్బుతం. ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ మాట్లాడుతూ...నేను ఈ పంక్షన్ కి అటెండ్ కావటం చాలా గౌవరం గా భావిస్తున్నాను. అలాగే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు నేను చూసాను.నేను గ్యారింటీగా చెప్తున్నాను...ఈ చిత్రం ఓ వండరఫుల్ ప్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని అంది. అలాగే దర్శకుడు శంకర్ గురించి మాట్లాడుతూ.. "ఇప్పుడిలా ఉన్నానంటే కారణం శంకర్‌. ఆయన వల్లే నటిగా నిలదొక్కుకున్నాను. నా తొలి విజయం 'జీన్స్‌'. ఆ సినిమాను ఎప్పటికీ మరచిపోలేను' అని చెప్పుకొచ్చింది.

ఇక దర్శకులు శంకర్ మాట్లాడుతూ..."రోబో సినిమాకి ఐశ్వర్య అందించిన సహకారం మరువలేనిది. దక్షిణాఫ్రికాలోని అడవులో ఓ పాటను చిత్రించాం. అక్కడ మాచ్‌బుచ్‌ అనే కీటకాలెక్కువ. అవి కుడితే దద్దుర్లు లేచి నెల రోజుల వరకూ తగ్గవు. అక్కడ సౌకర్యాలు కూడా చాలా తక్కువ. అక్కడ షూటింగ్‌ లో ఐష్‌ పాల్గొన్నారు. ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోలేదు. ఆమె చక్కటి నటి" అన్నారు. అలాగే బాలచందర్ కూడా...ఐశ్వర్య రాయ్‌ అందాన్ని ఆరాధించని వాళ్లుండరు. వారిలో నేనూ ఒకణ్ని అన్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిర అనే నూతన దర్శకుడు రూపొందించాడు. అలాగే కార్తీక్ రాజ సంగీతం అందించారు. ఈ పంక్షన్ కి వైరముత్తు, మహేంద్రన్, ప్రతాపన్, లింగు స్వామి, శశి వంటి తమిళ ప్రముఖులు అటెండయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu