మాస్ క్యారెక్టర్లో నయనతార, నోట్లోంచి బ్లేడు తీస్తుందట!
హైదరాబాద్: హీరో జీవా, సౌత్ హాట్ బ్యూటీ నయనతార జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తిరునాళ్'. ఈ చిత్రానికి పీఎస్.రామనాథ్ దర్శకత్వం వహిస్తుండగా ఎం.సెంథిల్ కుమార్ నిర్మిస్తున్నారు. రాజకీయం, రౌడీయిజం అంశాల మేళవింపుతో ఓ స్కాం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
ఈ చిత్రంలో జీవా ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అదుకు తగిన విధంగా సినిమాలో జీవా లుక్ కనిపించబోతోంది. ఇందులో ఆయన పాత్ర పేరు బ్లేడ్. ఓ రౌడీ. తరచూ నోట్లోంచి బ్లేడు తీస్తుంటాడు. ఇందులో బ్లేడు ప్రియురాలిగా నటిస్తున్న నయనతార కూడా ఓ సన్నివేశంలో నోట్లోంచి బ్లేడు తీస్తుందట.
ఇప్పటికే విడుదలైన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. లంగా ఓనీలో నయనతార పల్లెటూరి అమ్మాయి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అంటున్నాడు నిర్మాత సెంథిల్ కుమార్. తన నెక్ట్స్ మూవీ కూడా ఈ ఇద్దరు జంటగా చేయనున్నట్లు తెలిపారు.

జీవా, నయనతార
హీరో జీవా, సౌత్ హాట్ బ్యూటీ నయనతార జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తిరునాళ్'

తిరునాళ్
ఈ చిత్రానికి పీఎస్.రామనాథ్ దర్శకత్వం వహిస్తుండగా ఎం.సెంథిల్ కుమార్ నిర్మిస్తున్నారు. రాజకీయం, రౌడీయిజం అంశాల మేళవింపుతో ఓ స్కాం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

మాస్ రోల్
ఈ చిత్రంలో జీవా ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అదుకు తగిన విధంగా సినిమాలో జీవా లుక్ కనిపించబోతోంది. ఇందులో ఆయన పాత్ర పేరు బ్లేడ్.

నయనతార
బ్లేడు ఓ రౌడీ. తరచూ నోట్లోంచి బ్లేడు తీస్తుంటాడు. ఇందులో బ్లేడు ప్రియురాలిగా నటిస్తున్న నయనతార కూడా ఓ సన్నివేశంలో నోట్లోంచి బ్లేడు తీస్తుందట.

జోడీ అదిరింది
తిరునాళ్ మూవీలో జీవా, నయనతార జోడీ సూపర్బ్ అంటున్నారంతా.


Click it and Unblock the Notifications











