»   »  కబాలి:రజనీకాంత్ కు విలన్‌గా ఇతనే?

కబాలి:రజనీకాంత్ కు విలన్‌గా ఇతనే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్ సంచలన చిత్రం బాషా తరువాత మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న చిత్రం కబాలీ. తెలుగులో మహాదేవ్ టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో ఆయన రెండు విభిన్న గెటప్ లలో లో అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో పూర్తిగా నెరిసిన గడ్డం, మీసాలతో ఫుల్ సూట్‌లో ఉన్న ఆయన గెటప్ ఇప్పటికే ఫ్యాన్స్ ని ఊపేస్తోంది. ఇక మరో యంగ్ గెటప్‌లో సూపర్‌స్టార్ కొత్త కోణంలో కబాలీ చిత్రంలో ఆవిష్కృతం కానున్నారని సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర కథ అధిక భాగం మలేషియాలో నడుస్తుంది. దాంతో కబాలీ చిత్ర దర్శకనిర్మాతలు ఈ చిత్రంలో రజనీ కు ప్రపంచ వ్యాప్యంగా ఉన్న ఇమేకు తగ్గట్టుగా విలన్‌ను ఎంపిక చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఆ విలన్ ఓ పెద్ద స్టార్ అని తాజా చెన్నై వర్గాల సమాచారం.

కబాలీ చిత్రంలో హాంకాంగ్ స్టార్స్‌లో ఒకరిని ఎంపిక చేయనున్నారని తెలిసింది. ఐపీమ్యాన్ సిరీస్ చిత్రాల ఫేమ్ డోనీయెన్, జాన్ కుయ్, షోగర్ల్ అండ్ ది డార్క్ క్రిస్టల్ చిత్రాల ఫేమ్ విన్‌స్టన్ చావో,ది క్రాడిల్ ఆఫ్ లైఫ్ చిత్రం ఫేమ్ సిమోన్ యామ్, గాన్ విత్ ది బులెట్స్ చిత్రం ఫేమ్ జయాంగ్ వెన్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, ఎట్ వరల్డ్ ఎండ్ చిత్రాల ఫేమ్ చెయాన్ ఫాట్‌లలో ఒకర్ని సూపర్‌స్టార్‌కు విలన్‌గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Jet Li to Play Villain Role in Rajinikanth Kabali Movie

రజనీకాంత్‌, హాంకాంగ్ స్టార్ కాంబినేషన్ సీన్స్ 2016 ప్రారంభంలో మలేషియా, హాంకాంగ్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే నెల ఒకటో తారీఖున విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అలాగే హాంకాంగ్ స్టార్ హీరో జెట్లీ రజనీకాంత్‌కు విలన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. నటి రాధిక ఆప్తే రజనీకాంత్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న ఈ చిత్రంలో దినేశ్, కలైయరసన్, ధన్సిక, జాన్ విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రంజిత్ హ్యాండిల్ చేస్తున్నారు.

English summary
A fresh news is out from this movie and news is Chinese Acton Star “Jet Li” will be a part of this movie and there is the rumor is going on that Jet Li will be doing a Villain role in Kabali Movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu