పెళ్ళి తర్వాత మళ్ళీ జంటగా నటిస్తోన్న స్టార్స్ సూర్య , జ్యోతిక...
ప్రముఖ నటి నగ్మా చెల్లెలు జ్యోతిక గుర్తింది కదూ.... తమిళ సూపర్ స్టార్ సూర్యాని పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉంటోంది. అయితే, చాలా కాలం తర్వాత ఇప్పుడు తాజాగా భర్తతో కలిసి మళ్లీ నటించింది. అయితే... సినిమాలో మాత్రం కాదండోయ్... ఇద్దరూ కలిసి ఓ అడ్వర్ టైజ్ మెంట్ లో నటించారు. ఈమధ్యే ఈ కమర్షియల్ ను షూట్ చేసారు. దీనికి కూడా జ్యోతిక మొదట్లో ఒప్పుకోలేదట. అయితే, సూర్యా ఎంతగానో నచ్చచెప్పడం వల్ల ఒప్పుకుందట.
సినీతారల జంటల్లో సూర్య, జ్యోతికల జంటకు మార్కెట్ లో చాలా డిమాండ్ వుంది. అందుకే, చాలా కంపెనీలు వీళ్లిద్దర్నీ కలిసి తమ యాడ్స్ లో నటించమంటూ అడుగుతుంటాయి. అలాగే, భార్య సినిమాలలో నటించినా తనకు అభ్యంతరం లేదని సూర్యా అంటున్నప్పటికీ మేడం గారే ఒప్పుకోవడం లేదు. పిల్లలు, సంసారానికే అంకితమైపోతోంది!


Click it and Unblock the Notifications











