For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  23 ఏళ్ల యువతిని 'పెళ్లి' చేసుకున్న సీనియర్ 'హీరో'.. కాజల్ షాకింగ్ కామెంట్స్

  |

  సినీ ఇండస్ట్రీలో పెళ్లిల్లు, విడాకులు, ప్రేమాయణాలు, బ్రేకప్ లు సర్వసాధారణమే. అలాగే చిన్న వయసు వారితో డేటింగ్ లు, లవ్ ట్రాక్ లు, వివాహాలు కూడా సాధారణమే. అంతెందుకు తమ కన్న చిన్న వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. తన పెళ్లి చూడటానికి వచ్చిన కరీనా కపూర్ ను సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం హాట్ బ్యూటీ మలైకా అరోరాతో ప్రేమాయణం సాగిస్తున్న అర్జున్ కపూర్.. తన పదమూడేళ్ల వయసులో ఆమె వివాహానికి హాజరై కూల్ గా కూల్ డ్రింక్ కూడా తాగాడు. ఇటీవల 57 ఏళ్ల సీనియర్ హీరో, నటుడు 23 ఏళ్ల అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాహంపై తనదైన శైలీలో స్పందించింది కాజల్.

  బంధాలను తెంపుకుని కొత్త బంధంలోకి..

  బంధాలను తెంపుకుని కొత్త బంధంలోకి..

  సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో వివాహాలు, విడాకులు, లవ్ ట్రాక్ లు, బ్రేకప్ లు సర్వసాధారణం. ఆలాగే మొదటి పెళ్లిని విడిచి రెండో వివాహం చేసుకోవడం అతి క్యాజువల్ థింగ్ గా మారింది. ఇక ఇటీవల కాలంలో అయితే ఈ బంధాలను తెంపుకుని కొత్త బంధంలోకి వెళ్లే సెలబ్రిటీలు అనేకమందే ఉన్నారు. బాలీవుడ్ హాట్ భామ మలైక్ అరోరా తన భర్త అర్భాజ్ ఖాన్ నుంచి దూరమై తన కన్నా 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రపంచానికి నిర్మోహాటంగా బయటపెట్టారు. వాళ్లను తప్పుబట్టిన వారికి సైతం తమదైన శైలీలో సమాధానం ఇచ్చారు.

   రెండో వివాహం చేసుకున్నట్లు..

  రెండో వివాహం చేసుకున్నట్లు..

  అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన భార్య సుస్సానే ఖాన్ ను వదిలి తన కన్నా 12 ఏళ్లు చిన్నదైన సబా ఆజాద్ తో డేటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సీనియర్ నటుడు, పెళ్లి సినిమా ఫేమ్ పృథ్వీరాజ్ రెండో వివాహం చేసుకున్నట్లు కోలీవుడ్ టాక్. ఆయనకు 57 ఏళ్లు కాగా అతను చేసుకున్న అమ్మాయికి 23 ఏళ్లు అని ప్రచారం జరుగుతోంది.

   రెండో పెళ్లిపై కాజల్ స్పందన..

  రెండో పెళ్లిపై కాజల్ స్పందన..

  ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో తెగ హాట్ టాపిక్ అయింది. అనేకమంది పృథ్వీ రాజ్ ను విమర్శించారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ రెండో పెళ్లిపై బిగ్ బాస్ ఫేమ్ కాజల్ పసుపతి తీవ్రంగా స్పందించింది. తనదైన శైలిలో పోస్ట్ పెట్టింది. అతనికి ఆ కెపాసిటీ ఉందంటూ సోషల్ మీడియా వేదిక రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

   మీకు వచ్చే సమస్య ఏంటీ..

  మీకు వచ్చే సమస్య ఏంటీ..

  ఈ పోస్ట్ లో ''అతనికి ఆ కెపాసిటీ ఉంది. పెళ్లి చేసుకున్నాడు. దాంతో మీకు వచ్చే సమస్య ఏంటీ.. విషసమాజంలో అసూయపు మనుషులు'' అని రాసుకొచ్చింది కాజల్ పసుపతి. కాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన వసూల్ రాజా ఎంబీబీఎస్ మూవీలో చిన్న పాత్రలో నటించింది కాజల్ పసుపతి. కలకలప్పు 2తోపాటు తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. అలాగే కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా 54వ రోజు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 70వ రోజు ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.

  34 ఏళ్ల చిన్నదైన మలేసియా అమ్మాయితో..

  34 ఏళ్ల చిన్నదైన మలేసియా అమ్మాయితో..

  ఇక పృథ్వీరాజ్ విషయానికొస్తే.. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన మర్మదేశం, వాణి రాణి, రమణి వర్సెస్ రమణి, అరాసీ తదితర సీరియల్స్ తో ఆకట్టుకున్నాడు. ఇదివరకు బీనా అనే యువతిని 30 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ తన కంటే 34 ఏళ్ల చిన్నదైన మలేసియా అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై పృథ్వీరాజ్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.

  English summary
  Bigg Boss Tamil Fame Kaajal Pasupathi Reaction On 57 Year old Actor Babloo Prithiveeraj Second Marriage With 23 Years Malaysian Girl
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X