»   » రజనీకి వెన్నుపోటు పొడుస్తున్నారు.. కాలా వేడుకలో దర్శకుడిపై ధనుష్ మండిపాటు

రజనీకి వెన్నుపోటు పొడుస్తున్నారు.. కాలా వేడుకలో దర్శకుడిపై ధనుష్ మండిపాటు

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Danush Makes Sensational Comments On a Director

  కబాలి సెన్సేషనల్ హిట్ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాలా. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలోని నందనంలో వైఎంసీఏ మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్, నిర్మాత ధనుష్ పాల్గొన్నారు. ఈ వేడుకలో అభిమానులను ఉద్దేశించి రజనీ అల్లుడు, నటుడు, నిర్మాత ధనుష్ మాట్లాడారు.

  రజనీకి పొగడ్తలంటే ఇష్టం ఉండదు

  రజనీకి పొగడ్తలంటే ఇష్టం ఉండదు

  రజనీకాంత్‌కు పొగడ్తలంటే ఇష్టం ఉండదు. అందుకే ఆయనపై ప్రశంసలు గుప్పించాను. కానీ ఆయన నుంచి నేర్చుకొన్న గొప్ప విషయాలను మీకు చెప్పాలనుకొంటున్నాను అని ధనుష్ అన్నారు. తన ప్రసంగంలో రజనీ గొప్ప విషయాలను ప్రస్తావిస్తూనే ఆయనపై ఇటీవల కాలంలో విమర్శలు చేస్తున్న దర్శకుడు భారతీరాజాపై విరుచుకుపడ్డారు.

  భారతీరాజాపై ధనుష్ మండిపాటు

  భారతీరాజాపై ధనుష్ మండిపాటు

  ఏ వ్యక్తి అయినా పేరు, ప్రఖ్యాతులు సంపాదించాలంటే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి బాగా కష్టపడి, చమటోడ్చటం ద్వారా దానిని సాధించవచ్చు. రెండవది మార్గం ఏమిటంటే.. ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తులను విమర్శించడం ద్వారా అది సాధిస్తారు. రజనీ సార్‌తో పనిచేసి బాగా డబ్బు సంపాదించిన కొందరు వ్యక్తులు ఆయనను విమర్శిస్తున్నారు. ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారు అని దర్శకుడు భారతీరాజాపై ధనుష్ మండిపడ్డారు.

  రజనీపై విమర్శలు చేస్తే సహించం

  రజనీపై విమర్శలు చేస్తే సహించం

  రజనీ సార్‌పై విమర్శలు చేస్తున్నవారిపై మేము సహనం వహిస్తున్నాం. అలాంటి వారిని ఈ ఆడియో వేడుకకు ఆహ్వానించకూడదు అని అనుకొన్నాం. కానీ తనపై విమర్శలు చేస్తున్నవారిని కూడా ఈ ఫంక్షన్‌కు పిలవాలని కోరారు. తనను విమర్శించే వారంతా నా స్నేహితులే అని అన్నారు. రజనీ సార్ గొప్పతనానికి ఇది నిదర్శనం అని ధనుష్ పేర్కొన్నారు.

  రజనీపై భారతీ రాజా విమర్శలు

  రజనీపై భారతీ రాజా విమర్శలు

  ఇటీవల రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాల్లోకి రజనీ ప్రవేశంపై దర్శకుడు భారతీరాజా అభ్యంతరం వ్యక్తం చేశాడు. రజనీ తమిళేతరుడు. ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగారు. అలాంటి వ్యక్తి తమిళ రాజకీయాల్లోకి రావడమేంటీ అని భారతీరాజా విమర్శించారు.

  ఐపీఎల్ వివాదం నేపథ్యంలో

  ఐపీఎల్ వివాదం నేపథ్యంలో

  చెన్నైలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న శ్రీమాన్, భారతీరాజా, ఇతర వ్యక్తులపై రజనీకాంత్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రజనీపై భారతీ రాజా తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటక ప్రయోజనాలను ఆశించే దూత అని వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీ, భారతీరాజా కలిసి పలు చిత్రాలకు పనిచేశారు. వారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.

  English summary
  Superstar Rajinikanth's much-anticipated film Kaala Audio launch was held yesterday at the YMCA grounds in Nandanam, Chennai. The crew of Kaala including Rajinikanth, director Pa Ranjith and producer Dhanush graced the event. After speaking about Rajinikanth's sincerity, Dhanush took a jibe at ace director Bharathiraja and others who have been openly criticising the Superstar in the recent times.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more