వినూత్నమైన సబ్జెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పా రంజిత్

రజనీకాంత్‌తో 'కబాలి', 'కాలా' లాంటి చిత్రాలు తీసిన తమిళ దర్శకడు పా రంజిత్ త్వరలో బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. గిరిజన స్వాంతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

పా రంజిత్ బాలీవుడ్ ఎంట్రీని ఖరారు చేస్తూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని నమా పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఈ సంస్థ గతంలో ఇషాన్ ఖట్టర్, మాళవిక మోహన్ నటించిన 'బియాండ్ ది క్లౌడ్స్' చిత్రాన్ని నిర్మించింది.

Kaala, Kabali fame Pa Ranjith’s Bollywood debut

బిర్సా ముండా జీవితం ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక సైతం జరుగాల్సి ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

మనకు అల్లూరి సీతారామరాజు ఎలాగో.... ఉత్తరాదిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారిలో బిర్సా ముండా ఒకరు. జార్ఖండ్ ప్రాంతంలో 1980 కాలంలో ఆయన బ్రిటిష్ వారిపై పోరాటం చేసి చరిత్రకెక్కారు.

పా రంజిత్ రూపొందించిన 'కబాలి', 'కాలా' చిత్రాలు రికార్డు స్థాయి కలెక్షన్ సాధించింది. అతడి మేకింగ్ స్టైల్ సైతం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా రజనీకాంత్‌ను తెరపై చూపించిన విధానం అభిమానులను ఎంతగానో మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X