»   » తెల్లవారు జామున మహేష్‌ మా ఇంటికి వచ్చి...

తెల్లవారు జామున మహేష్‌ మా ఇంటికి వచ్చి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : మహేష్‌బాబు నాకు స్కూల్‌ ఫ్రెండ్‌. ఓసారి తెల్లవారు జాము నాలుగు గంటలకి మహేష్‌ మా ఇంటికి నోట్స్‌ కోసం వచ్చాడు. విషయం ఏంటంటే... పరీక్ష కూడా అదే రోజు. అయినా తనకు తెలివితేటలు ఎక్కువ. చాలా త్వరగా చదివి పాసైపోయేవాడు అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు తమిళ హీరో కార్తీ.

ఇక కార్తీ తెరకి పరిచయమై ఏడేళ్లవుతోంది. నటించింది 9 సినిమాలు. సక్సెస్‌లు 4. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. 10వ సినిమా బిరియాని విడుదల అయ్యి ఓకే అనిపించుకు్ంది. ఈ సినిమాలో గత చిత్రాలకంటే భిన్నంగా ప్లేబోయ్‌ పాత్రలో కనిపించారు కార్తీ. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే, ప్రయోగాలకు వెనుకాడని నైజం కార్తీ సొంతం.

Kaarthi about his relation with Mahesh babu

కార్తీ మాట్లాడుతూ- ఆవారా .. తర్వాత స్టయిలిష్‌ సినిమా చేయమని చాలామంది అడిగారు. అన్ని అంశాల మేలుకలయికతో వెంకట్‌ప్రభు చక్కని కథ చెప్పారు. సిటీ నేపథ్యంలోని థ్రిల్లర్‌ ఇది. విన్న వెంటనే ఓకే చేశా. ఫీల్‌ మెయింటెయిన్‌ చేస్తూనే అండర్‌కరెంట్‌ సందేశంతో సినిమాలు తీస్తాడు వెంకట్‌ప్రభు. నాకు ఇది చాలా స్పెషల్‌ మూవీ. ఇందులో ప్లేబోయ్‌గా కనిపించాను. ఆ పాత్ర అమ్మాయిలుకు బాగా నచ్చుతోంది. హన్సిక ఈ సినిమా కోసం బరువు తగ్గింది. తన ఇంట్రడక్షన్‌లో బాత్రూమ్‌ రొమాన్స్‌ ఆకట్టుకుంటుంది. పంజాబి కుడి మాండీ థాకర్‌ ఐటమ్‌ నంబర్‌ అదరగొట్టేసింది. ఆ పాట చాలా ప్రత్యేకం. యువన్‌ చిన్ననాటి స్నేహితుడు. అతడికి సంగీతదర్శకుడిగా 100వ చిత్రం నాదే కావడం ఆనందంగా ఉంది అన్నారు.

English summary
Tamil hero Kaarthi says that ..Mahesh Babu is his best friend in his School days. He said Mahesh is an intelligent student from childhood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu