»   » సీక్రెట్ రివీలైంది:'బాహుబలి' ని కొట్టాల్సిందే, చేతబడి తో ...అందుకే హీరో ఒప్పుకున్నాడట

సీక్రెట్ రివీలైంది:'బాహుబలి' ని కొట్టాల్సిందే, చేతబడి తో ...అందుకే హీరో ఒప్పుకున్నాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: బాహుబలితో పోటీ పడాలి అంటే ఏం చేయాలి. ఇప్పుడు తమిళ, తెలుగు స్టార్ హీరోలందరి ఆలోచనా ఇదే. అందుకోసం వారు ఏమి చేయటానికైనా సిద్దపడుతున్నారు. కథలో కొత్తదనం, భారీ బడ్డెట్, గెటప్ ఛేంజ్, అవసరం అనుకుంటే బాహుబలి టెక్నీషియన్స్ నే సీన్ లోకి తీసుకురావటం. ఇప్పుడు కార్తీ కూడా అదే చేయబోతున్నాడు.

కథ కొత్తగా ఉన్నప్పుడు కుమ్మేయడమే, పాత్ర మనసుకి బాగా దగ్గరైనప్పుడు ప్రయోగాలు చేయడానికి వెనుకడుగు వేయాల్సిన పని లేదు ఇదే తమిళ హీరో కార్తీ మొదటి నుంచి అనుసరిస్తున్న ధీరి. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి గెటప్‌ మార్చేయడానికి సిద్ధమే. ప్రసుత్తం కార్తి అదే చేశాడు.

కార్తి హీరోగా నటిస్తున్న చిత్రం 'కాష్మోరా'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోకుల్‌ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ బయటకు వచ్చింది. అందులో కార్తి గెటప్‌ ఆకట్టుకొంటూ అందరిలో చర్చనీయాంశంగా మారింది. గుండు, గడ్డంతో కార్తి కొత్తగా కనిపిస్తున్నాడు.

ఫస్ట్‌లుక్‌ చూస్తే 'ఇది కార్తియేనా' అనిపిసోంది అన్నట్లుగా ఉంది. ఈ చిత్రం చేతబడులుచుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. అదే ఈ సినిమాలో హైలెట్ అంశంగా నిలవనుంది. అలాగే అరవై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది.

హారర్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తారు. తెలుగులో ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ విడుదల చేయనుంది. దీపావళికి 'కాష్మోరా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఈ నేపధ్యంలో అసలు కార్తీ చేయబోయే పాత్ర ఏమిటి...నయనతార పాత్ర ఏమిటి...డైరక్టర్ ఈ సినిమాలో ఏం చూపబోతున్నాడు..బాహుబలితో ని రీచ్ అవుతానంటున్నారు..నిజమేనా అంత సత్తా ఉందా అనే డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. వాటిని తీర్చడానికే మేం ఈ కథనం అందిస్తున్నాం.

స్లైడ్ షోలో మిగతా విశేషాలు..

300 మంది

300 మంది

బాహుబలిని ఎదుర్కోవటానికి ఈ చిత్రం కోసం 300 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో యుద్దం సన్నివేశాలు తీస్తున్నారు.

ఆర్మీ జనరల్

ఆర్మీ జనరల్

ఈ సినిమాలో కార్తీ ... ఓ పెద్ద రాజ్యానికి ఆర్మీ జనరల్ గా కనిపించనున్నాడు. అతని పేరు రాజ నాయక్ అయితే ఆ పాత్ర నెగిటివా, పాజిటివా అనేది తెలియాల్సి ఉంది. ఈ పాత్రలో ఆయన 30 నిముషాలు పాటు ఉంటారు.

నయనతార

నయనతార

ఈ సినిమాలో నయనతార రత్న మహాదేవి గా కనిపించనుంది. కేవలం ఆమె పీరియడ్ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. ఆ రాజ్యానికే సైన్యాధిపతి కార్తి.

సస్పెన్స్

సస్పెన్స్

ఇందులో కార్తీ మూడు పాత్రల్లో కనిపిస్తారు. మొదటి పాత్ర ఆర్మీ అధికారి, రెండో పాత్ర ఈ కాలానికి చెందిన కుర్రాడిది కాగా మూడవ పాత్ర ని సస్పెన్స్ లో ఉంచుతున్నారు.

దెయ్యం

దెయ్యం

ఇక మూడో పాత్ర కార్తీ దెయ్యం అయ్యిండవచ్చని అంటున్నారు. ఎందుకంటే కాశ్మోరా టైటిల్ ని బట్టి ఇందులో దెయ్యాల ప్రసక్తి కూడా ఉండే అవకాసం ఉంది.

ఫెరఫెక్ట్ టైటిల్

ఫెరఫెక్ట్ టైటిల్

సినిమా చూసిన తర్వాత కాశ్మోరా అనే టైటిల్ ఎందుకు పెట్టామో ప్రేక్షకులకు అర్దం అవుతుంది. అదే ఫెరఫెక్ట్ టైటిల్ అంటున్నాడు దర్శకుడు

హైలెట్

హైలెట్

ఈ సినిమాకు ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ కుదరటమే హైలెట్ అంటున్నాడు మరో నిర్మాత ప్రకాష్ బాబు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఎట్టి పరిస్దితుల్లోనూ తమ కాశ్మోరా చిత్రాన్ని దీపావళికి తెచ్చే ప్లానింగ్ ఉన్నామని చెప్తున్నారు.

ఆ టీమ్ నే

ఆ టీమ్ నే

ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ని 'బాహబలి' సినిమాకి పనిచేసిన మకుట సంస్థ సమకూరుస్తున్నది. ఈ సినిమాకి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

ఫేస్ స్కాన్

ఫేస్ స్కాన్

ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దాదాపు పదిహేను నిమిషాల పాటు 3డి ఫేస్ స్కాన్ చేసి చిత్రీకరించనున్నారు. గతంలో రజనీకాంత్ 'కొచ్చాడియాన్' సినిమాకు ఈ టెక్నాలజీ ఉపయోగించారు.

పీవీపి సంస్ద

పీవీపి సంస్ద

ఇంతకు ముందు ఊపిరి చిత్రం నిర్మించిన పీవీపీ సినిమావారే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ట్రెండింగ్

ట్రెండింగ్

ఈ సినిమాలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాష్మోరా ఫస్ట్‌లుక్ విడుదల దగ్గరనుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది.

English summary
In Karthi's upcoming film Kaashmora, an important war sequence, which has been shot with 300 junior artists, will match up to the standard set by SS Rajamouli's Baahubali, according to a source close to the project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu