»   » ఫస్ట్ టైమ్ ఈ రికార్డ్ క్రియేట్ చేసింది రజనీ ‘కబాలి’నే

ఫస్ట్ టైమ్ ఈ రికార్డ్ క్రియేట్ చేసింది రజనీ ‘కబాలి’నే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజినీకాంత్‌ హీరో గా నటించిన చిత్రం 'కబాలి'. రాధికా ఆప్టే హీరోయిన్. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ ఆన్‌లైన్‌లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో 'కబాలి'పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రజనీకాంత్‌ ఫాలోయింగ్‌ బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని ఇప్పటికే అనేక భాషల్లో డబ్‌ చేస్తున్నారు. ఈ జాబితాలోకి మరో భాష వచ్చి చేరింది.

మలేషియాలో తమిళ చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'కబాలి'ని మలయ్‌( మలేషియా బాష)లోకి అనువదిస్తున్నారు. డబ్ చేసిన ఆ ట్రైలర్ ని ఫేస్ బుక్ లో షేర్ చేసారు. దానిని మీరు ఇక్కడ చూడవచ్చు.

దీంతో మలయ్‌ బాషలోకి డబ్‌ అయిన తొలి తమిళ చిత్రంగా కబాలి రికార్డు సృష్టించింది. మలేషియా మీడియా కంపెనీ అయిన మాలిక్‌ స్ట్రీమ్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చేయనుంది. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దినేశ్‌ రవి, ధన్సిక, జాన్‌ విజయ్‌లు ముఖ్య పాత్రలు పోషించారు.

Kabali becomes the first Tamil film to be dubbed in Malay

నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా.. ఆయన భార్యగా రాధిక ఆప్టే కనిపించనుంది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ సెన్సేషనల్ ప్రాజెక్టు '2.o'(రోబో-2)లో నటించేందుకు ప్రస్తుతం కాస్తా విరామం తీసుకున్న ఆయన మళ్లీ 'కబాలి' టీమ్‌తో జాయిన్‌ అయ్యాడు. చెన్నైలోని ప్రఖ్యాత ప్రివ్యూ థియేటర్‌ లే మ్యాజిక్‌ లాంతర్న్‌లో ఆయన 'కబాలి'కి డబ్బింగ్ చెప్తున్నారు.

'సినిమా పోస్ట్ ప్రోడక్షన్‌ పనులన్నీ పూర్తయ్యే దశకు వచ్చాయి. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటింగ్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు పా రంజీత్ పర్యవేక్షణలో స్పెషల్ ఎఫెక్ట్స్‌, ఎడిటింగ్‌ పనులు చకచకా జరిగిపోతున్నాయి' అని చిత్ర యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

యస్సు మళ్లిన మాజీ గ్యాంగ్‌ స్టర్‌గా రజనీ నటిస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Kabali is now the first Tamil film to be dubbed in the Malay language. Tamil films have a commendable market in Malay but so far no Tamil film has been dubbed in the language. Malik Streams Productions and Distribution, a Malaysian media company has dubbed the film. The Malay version of the teaser was unveiled on their official Facebook page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu