»   »  ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేసారు ఓకే..మధ్యలో 'బాహుబలి' ప్రస్తావన ఎందుకు?

ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేసారు ఓకే..మధ్యలో 'బాహుబలి' ప్రస్తావన ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'లింగ' తర్వాత రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కబాలి'. పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్తే హీరోయిన్. చిత్రంలో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలురకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటన్నింటికి ఏమాత్రం సంబంధం లేకుండా తమ సినిమా ఉంటుందని దర్శకుడు రంజిత్‌ చెబుతున్నారు.

అలాగే ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలై సూపర్ హిట్టైంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం ఊపందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... తెలుగు,తమిళ, హిందీ, జపనీస్, మలై భాషల్లో రిలీజ్ అవుతోంది. దాంతో ఈ చిత్రం బిజినెస్ రెండు వందల కోట్లు వరకూ అవుతోందని చెప్తున్నారు.


అది అలా ఉంటే తమిళ మీడియాలో ,ముఖ్యంగా తమిళ సోషల్ మీడియాలో మాత్రం బాహుబలితో ఈ చిత్రాన్ని పోల్చి చూడటం మొదలెట్టారు. తమ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ లేవని, భారి యుద్దాలు లేవని, కేవలం రజనీ స్టామినాతోనే ఈ స్దాయి బిజినెస్ జరుగుతోందని, అదీ సూపర్ స్టార్ సత్తా అని అంటున్నారు.


Kabali’s pre-release business Shocking?


ఇక ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించాలని ఆరంభంలో భావించారు. 12వ తేదీన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి కపిలన్‌ పాటలు రాశారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం గ్రాఫిక్స్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అవి కూడా వారం, పదిరోజుల్లో పూర్తికానున్నట్లు సమాచారం.


12వ తేదీన ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించాలని థాను భావిస్తున్నారు. వైఎంసీఏ మైదానంలోగానీ, నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలోగానీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి రజనీకాంత్‌ అభిమానులను ఆహ్వానించనున్నారు.


ఇందులో ప్రముఖ నటీనటులు, సాంకేతిక కళాకారులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెరికాలో కుటుంబంతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు రజనీకాంత్‌. పదో తేదీన చెన్నైకి రానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే నెల ఒకటో తేదీన తెరపైకి తీసుకురానున్నట్లు నిర్మాత ఇప్పటికే ప్రకటించారు.

English summary
Super Star Rajinikanth’s upcoming gangster flick,Kabali’s theatrical business in all versions will touch the magical figure of 200 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu