»   » రజనీ 'కబాలి' లేటెస్ట్ అప్ డేట్స్...నమ్మలేని నిజాలు

రజనీ 'కబాలి' లేటెస్ట్ అప్ డేట్స్...నమ్మలేని నిజాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్‌ తాజా సినిమా 'కబాలి' ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రజనీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని విషయాలు బయిటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్రం రిహార్షల్ సెషన్స్ ప్రస్తుతం చెన్నైలో కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇందులో కీ రోల్స్ చేసే ఆర్టిస్టులు అంతా పాల్గొంటున్నారు. అంతేకాదు.. ఈ రిహార్శల్స్ లో రజనీ కూడా పాలుపంచుకోవటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. సూపర్ స్టార్, సీనియర్ ఆర్టిస్టు అయిన ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా రిహార్షల్స్ లో దర్శకుడు కోరిక మన్నించి పాల్గొనటమేంటనేదే హాట్ టాపిక్.

అయితే మిగతా ఆర్టిస్టులకు ఉత్సాహం ఇవ్వటానికి రజనీ స్వయంగా తాను రిహార్శల్స్ కు హాజరుకావటానికి ఉత్సాహం చూపించినట్లు సమాచారం. దర్శకుడు గత చిత్రాల్లో ఫెరఫార్మెన్స్ కు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అలాగే ఫెరఫార్మెన్స్ విషయంలో రాజీ పడకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. రజనీలోని యాక్టింగ్ స్కిల్స్ ని ఈ చిత్రంలో మరోసారి వెలికితీయనున్నారు

మలేషియా షెడ్యూలు తగ్గింపు

మలేషియా షెడ్యూలు తగ్గింపు

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదట అనుకున్నట్లుగా కాకుండా మలేషియా షెడ్యూల్ డేస్ ని తగ్గించారు. పోలిన సెట్స్ ని చెన్నైలోనే వేస్తున్నారు.

డాన్ కాదు పోలీస్

డాన్ కాదు పోలీస్

ఈ చిత్రంలో రజనీకాంత్ డాన్ గా కనపడతారని వార్తలు వచ్చాయి. అయితే అదేం కాదు పోలీస్ పాత్ర అంటున్నారు.

కిషోర్ వచ్చాడు

కిషోర్ వచ్చాడు

ఈ టీమ్ లోకి కిషోర్ వచ్చి జాయిన్ అయ్యారు. చిత్రంలో నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది.

ఎప్పటినుంచి

ఎప్పటినుంచి

ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 17 నుంచి అని తెలుస్తోంది. సాలిగ్రామం..మోహన్ స్టూడియోస్ లో పెద్ద సెట్ వేస్తున్నారు.

వినాయక చవితికే

వినాయక చవితికే

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఓపినింగ్ రోజు అంటే సెప్టెంబర్ 17న వినాయిక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నారు.

ద్విపాత్రలు

ద్విపాత్రలు

ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. కాఖీ డ్రస్, సూట్ రెండింటితో ఫొటో షూట్ జరగటంతో ఈ డౌట్ వస్తోంది.

English summary
The latest update regarding Superstar Rajinikanth's upcoming film Kabali is that the actors and actresses selected to perform important roles in the movie are now a part of a series of painstaking rehearsal sessions that's going on in Chennai.
Please Wait while comments are loading...