»   » తమన్నాను తట్టుకోవాలంటే అలా చేయక తప్పదు: కాజల్

తమన్నాను తట్టుకోవాలంటే అలా చేయక తప్పదు: కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనన్నా నుంచి కాజల్ కి తెలుగు, తమిళ భాషల్లో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. దాంతో కాజల్ తన రేటుని బాగా తగ్గించి ఆ పోటిని తట్టుకునేందుకు రెడీ అయిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రీసెంట్ గా 'కో" (రంగం) చిత్ర దర్శకుడు కె.వి.ఆనంద్ తన తదుపరి చిత్రాన్ని సియామీ కవలల కథతో తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో నిర్మించేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ, తమిళ ప్రేక్షకులు దీపికా పడుకొనెను రిసీవ్ చేసుకుంటారన్న నమ్మకంతో ఆ చిత్రంలో హీరోయిన్‌గా ఆమెను అడిగారు. అయితే సియామీ కవలల పాత్ర అంటే ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంటుందని దీపిక తన పారితోషికాన్ని ఆరు కోట్లకు డిమాండ్ చేసింది. దాంతో కళ్లు తిరిగిన దర్శకుడు వెనక్కి వచ్చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాజల్ కేవలం అరవై లక్షలకే నటిస్తానని కబురు పంపింది. వెంటనే దర్శకుడు ఏంటి ఇంత తక్కువ రేటుగా అనే డౌటుతో ఈ విషయాన్ని కాజల్‌ని అడిగితే మరి తమన్నా పోటీని తట్టుకోవాలంటే తగ్గించక తప్పదు అని కామెంట్ చేసిందట. అదీ మ్యాటర్.

English summary
Maatraan movie directed by KV Anand which will have Surya playing Siamese twins will have Kajal Agarwal in the lead says recent reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu