»   » ఆన్ లొకేషన్ ఫొటో: హీరో భుజాలపై వాలి కాజల్ గాఢ నిద్ర

ఆన్ లొకేషన్ ఫొటో: హీరో భుజాలపై వాలి కాజల్ గాఢ నిద్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాజల్ అగర్వాల్ బాగా అలసిపోయి...తను నటిస్తున్న చిత్రం హీరో విశాల్ భుజాలపై పడి ఇదిగో ఇలా నిద్రపోతోంది. విశాల్ హీరోగా నా పేరు శివ దర్శకుడు సుసీంధ్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సెట్ పై ఇది జరిగింది. వ్యానిటీ వ్యాన్ లేదా, రూమ్ కు వెళ్లి రెస్ట్ తీసుకునేంత కూడా లేనంతగా అలిసిపోవటంతో ఇదిగా ఇలా నిద్రపోతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పదేళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోందామె. దక్షిణాదిలో అగ్రతారగా గుర్తింపు తెచ్చుకొంది కాజల్ అగర్వాల్. ఇప్పుడు నటనను ఆస్వాదిస్తూ మంచి కథలు ఎక్కడొస్తే అక్కడే సినిమాలు చేస్తోంది. నటి కాబట్టి కాజల్‌ సినిమాల గురించే మాట్లాడుతుందనుకొంటే పొరపాటే. ఆమెకి చాలా విషయాలపై మంచి అవగాహన ఉంది. ఏ విషయం గురించైనా మాట్లాడేస్తుంది.

Kajal caught Sleeping on the SETS!

కాజల్ మాట్లాడుతూ... ''నటీనటులకు సినిమా సెట్‌ తప్ప మరో లోకం తెలిసే అవకాశం ఉండదు. అయినా అక్కడ్నుంచే ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. లేదంటే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది' అంటోంది కాజల్‌.

అదెలా సాధ్యమవుతోందని అడిగితే '' హీరోయిన్ గా ప్రయాణం ప్రారంభించాక ఆరేళ్లపాటు విరామం లేకుండా పనిచేశా. అప్పుడు వెనుదిరిగి చూసుకొంటే బోలెడన్ని విజయాలు కనిపించాయి. వ్యక్తిగతంగా మాత్రం ఏదో కోల్పోతున్నట్టు అనిపించేది. సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాలు అర్థమయ్యేవి కాదు. అప్పట్నుంచి నా జీవన శైలిని మార్చుకొన్నా. చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించడం అలవాటు చేసుకొన్నా.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేది సినిమా సెట్‌లోనే అయినా అక్కడ్నుంచే సమాజాన్ని చదవడం అలవాటు చేసుకొన్నా. తెలియని విషయాల గురించి తోటి నటీనటుల్ని అడిగి తెలుసుకుంటా. రాజకీయాలా, మరొకటా అని కాకుండా అన్ని విషయాలపైనా అవగాహన పెంచుకొనేందుకు ప్రయత్నిస్తుంటా'' అని చెప్పుకొచ్చింది కాజల్‌.

English summary
Kajal Agarwal was caught sleeping on the sets of her upcoming Tamil movie starring Vishal in lead role and directed of Suseenthiran of 'Naa Peru Shiva' fame.
Please Wait while comments are loading...