Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
పీకల్లోతు వివాదంలో పా రంజిత్... అరెస్ట్ నుంచి తప్పదా? 400 మంది మహిళలను..
కబాలి, కాలా చిత్రాలతో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న పా రంజిత్ వివాదంలో చిక్కుకున్నారు. చోళ సామ్రాజ్యధి నేత రాజరాజ చోళన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదంగా మారాయి. దాంతో ఆయనపై కేసు నమోదు కావడం కోలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది. అయితే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆయనకు అరెస్ట్ తప్పదా అనే ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఈ వివాదంలో ఏం జరుగుతున్నదంటే..

చోళుల పాలనపై పా రంజిత్ వ్యాఖ్యలు
ఇటీవల తంజావురు జిల్లాలో దళితులు ఏర్పాటు చేసిన ఓ సభలో పా రంజిత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చోళ చక్రవర్తి రాజ రాజ చోళుడు కాలం స్వర్ణయుగమని మన చరిత్ర చెబుతుంది. కానీ చరిత్రకారులు చెప్పిన ప్రకారం.. ఆయన పాలనలో దిగువ తరగతి కులాలు అణిచివేతకు గురయ్యాయి. తక్కువ కులాల వారీ భూములను రాజు ఆక్రమించుకొన్నాడు. ఆయనది ఓ చీకటి పాలన అంటూ పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

400 మంది మహిళలను దేవదాసీలుగా
అంతేకాకుండా, రాజ రాజ చోళుడు పాలనలో 400 మంది మహిళలను దేవదాసీలుగా మార్చారు. వారిలో 26 మందిని కోలార్ ఫీల్డ్స్‌కు పంపారు. ఆయన పాలన స్వర్ణయుగం ఎలా అవుతుందనే విధంగా మాట్లాడటం వివాదంగా మారింది. పా రంజిత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మరింత వివాదంగా మారాయి.

పా రంజిత్‌పై కేసు నమోదు
పా రంజిత్ వ్యాఖ్యలను తప్పుపట్టిన కొన్ని సంఘాలు ఆయనపై తిరుపండల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాయి. హిందు మక్కల్ కచ్చి సంఘం కార్యకర్తల ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 153, 153 ఏ 1 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు జూన్ 19న మద్రాస్ హైకోర్టులోని జస్టిస్ పీ రాజమానిక్కమ్ బెంచ్ ముందు విచారణకు రానున్నది. ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో అరెస్ట్ తప్పదనే వార్తలు గుప్పుమన్నాయి.

అరెస్ట్‌పై పోలీసుల అభిప్రాయమేమిటంటే
అయితే పా రంజిత్‌ను అరెస్ట్ చేసే అవకాశం లేదని, వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరుతారని, అనంతరం వాటి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది అంతేకానీ అరెస్ట్ చేయడం జరుగకపోవచ్చనే అంశాన్ని ఆయన సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని తమిళనాడు పోలీసులు ధృవీకరిస్తున్నారు.