twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీనా భర్త కోసం ముఖ్యమంత్రి ప్రయత్నించినా ఫలితం లేదు... అసలు విషయం తెలియకపోవడం వల్లే అలా?

    |

    కొద్దిరోజుల క్రితం నటి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో మరణించారని కొంత మంది, పావురాల వ్యర్ధాల వాసన పీల్చి మరణించారని కొంత మంది ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయద్దు అని నటి కుష్బూ ఈ విషయం మీద మీడియా వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తాజాగా కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఈ విషయం మీద స్పందించారు. ఆమె మాటల్లో అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

    కరెక్ట్ కాదని

    కరెక్ట్ కాదని


    విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ లక్షణాలతో మరణించారని కొంత మంది, కాదు పావురాల వ్యర్ధాలు పీల్చడం వల్ల వచ్చిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా నటి మీనా స్నేహితురాలు ప్రముఖ తమిళ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఈ విషయం మీద స్పందించారు. విద్యాసాగర్ కరోనా బారిన పడి చనిపోయారని అనడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు.

     అప్పుడు కూడా బాగానే

    అప్పుడు కూడా బాగానే


    ఆయనకు ముందుగానే బర్డ్ ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారని అయితే ఇన్ఫెక్షన్ సోకిన విషయం చాలా ఆలస్యంగా తెలిసిందని ఆమె అన్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన తరువాత ఆయనకు కోవిడ్ సోకిందని కోవిడ్ నుంచి ఆయన కోలుకున్నారని కళా మాస్టర్ వెల్లడించారు. చివరిగా మీనా తల్లి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఫిబ్రవరిలో తాము కలిశామని అప్పుడు కూడా ఆయన బాగానే ఉన్నారని కళా మాస్టర్ వెల్లడించారు.

     ట్రాన్స్ ప్లాంట్ చేయాలని

    ట్రాన్స్ ప్లాంట్ చేయాలని

    మార్చిలో నా పుట్టినరోజున మీనా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి సాగర్ హెల్త్ బాలేదని చెప్పడంతో నేను స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పలకరించానని కళా మాస్టర్ అన్నారు. దీంతో తన పుట్టినరోజు సందర్భంగా సాగర్ శుభాకాంక్షలు కూడా చెప్పాడని అప్పుడు కూడా ఆయన ఆరోగ్యం గానే ఉందని ఆమె అన్నారు. అయితే ఏప్రిల్ నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే వాటిని ట్రాన్స్ ప్లాంట్ చేయాలని వైద్యులు వెల్లడించినట్లు కళా మాస్టర్ పేర్కొన్నారు.

    వెతుకుతూనే

    వెతుకుతూనే


    అయితే ఆ ఊపిరితిత్తుల కోసం మూడు నెలల పాటు ప్రయత్నించామని, తమకు ఎక్కడా అవి అందుబాటులోకి రాలేదని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహా ఎంతోమంది మంత్రులను కూడా సహాయం కోరామని, వారు కూడా తమకు చేతనైన సహాయం చేశారు కానీ దానికి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అలా ఏప్రిల్ నెలలో నుంచి ఊపిరితిత్తుల కోసం వెతుకుతూనే ఉన్నాం.

    ధైర్యం చెబుతూ

    ధైర్యం చెబుతూ


    కానీ సాగర్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిందని ఆమె అన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా తుదిశ్వాస విడిచే వరకు సాగర్ ఎంతో ధైర్యంగా ఉండి తన భార్యకు ధైర్యం చెబుతూ ఉండేవారని కళా మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. చిన్న వయసులోనే సాగర్ చనిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్న ఆమె తన భర్తను బతికించుకోవడం కోసం మీనా చాలా ప్రయత్నించిందని అయినా ఆయన మనను విడిచి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

    English summary
    kala master revealed the facts about meena husband vidyasagar death in her recent interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X