Just In
- 1 hr ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 11 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజనీ చనిపోతాడా?: 'కబాలి' క్లైమాక్స్ మార్చమన్న నిర్మాత, రజనీ కుమార్తె
చెన్నై: అట్టకత్తి', 'మద్రాస్' వంటి భిన్న చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకున్న దర్శకుడు పా.రంజిత్. ఆయన చిత్రాల్లోని వైవిధ్యమే రజనీకాంత్ వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని పొందేలా చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ పతాకంపై రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం 'కబాలి'. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈచిత్రం గురించి దర్శకుడు ఓ నిజం బయటపెట్టారు.
రజనీ 'కబాలి' క్లైమాక్స్‌ని మార్చాల్సిందేనని రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్, నిర్మాత ఎస్.థాను తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు'అని ఇటీవల చెన్నైలో జరిగిన ఓ మీడియా సమావేశంలో దర్శకుడు పా.రంజిత్ అన్నారు. ఈ నెల 22న 'కబాలి' విడుదల కానున్న నేపథ్యంలో క్లైమాక్స్ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రంజిత్ దీనిపై వివరణ ఇచ్చారు.
రజనీకాంత్‌లాంటి స్టార్ హీరో నాతో వర్క్ చేయాలనుందనడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఒక దర్శకుడిగా నాకు అంతకంటే కావాల్సింది ఇంకేముంది?, రజనీకాంత్‌తో సినిమా చేసేందుకు ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు తపిస్తారు. అంత క్రేజ్ ఉన్న హీరోనే పిలిచి మరీ నాకు అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. కానీ క్లైమాక్స్ విషయంలో పట్టుబడితే ఏం చెయ్యగలం అన్నారు. అయితే రజనీనే సేవ్ చేసారని చెప్పారు.
అసలు ఆ క్లైమాక్స్ ఏమిటి... ఏం జరిగింది విషయాలు స్లైడ్ షోలో...

విషాదాంతం
'ఈ సినిమా చూసిన తర్వాత విషాదభరితంగా ఉన్న క్లయిమాక్స్‌ని ఎడిట్ చేసి, హ్యాపీ ఎండింగ్ ఇవ్వాల్సిందేనని సౌందర్య రజనీకాంత్, థాను ఇద్దరూ అభిప్రాయం వ్యక్తం చేశారు అన్నారు దర్శకుడు

జీర్ణించుకోలేరు..
రజనీకాంత్ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఈ తరహా క్లైమాక్స్‌ని జీర్ణించుకోలేరని చెప్పారు.

క్లైమాక్స్ కరెక్టే
వారి అభిప్రాయం సరైందే కావచ్చు కానీ నేను రాసుకున్న కథ ప్రకారం ఈ క్లైమాక్సే కరెక్ట్ అని భావించాను. ఈ విషయంలో మాకు అభిప్రాయ బేధాలున్నాయి.

మూడు రోజుల తర్వాత ...
రజనీ నాకు ఫోన్ చేసి, నువ్వు అనుకున్న క్లైమాక్స్‌నే కంటిన్యూ చెరు.. ఇందులో ఎవరి అభిప్రాయాన్ని నువ్వు ఫాలో అవ్వాల్సిన పని లేదని చెప్పారు.

వైవిధ్యం
రెగ్యులర్ రజనీ సినిమాలతో పోలిస్తే నా సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉండాలని ఆశించాను. నేను ఆశించినట్టుగానే రజనీ సార్ గ్రీన్‌సిగల్ ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు రంజిత్.

షాకయ్యే
గతంలో 'అట్టకత్తి', 'మద్రాస్' సినిమాలకు దర్శకత్వం వహిం చాను. కార్తీతో చేసిన 'మద్రాస్' సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రాల తర్వాత హీరో సూర్య సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేసుకుంటున్న టైంలో ఓ రోజు సౌందర్య రజనీకాంత్ (రజనీకాంత్ కుమార్తె) నాకు ఫోన్ చేసి 'నాన్న మీ 'మద్రాస్' సినిమా చూశారు. ఆయన మీతో పనిచేయాలను కుంటున్నార'ని చెప్పగానే షాకయ్యాను.

టెన్షన్ పడ్డాను
షూటింగ్‌లో ఆయన్ని డీల్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డా.

స్పందన అదుర్స్..
ఇటీవల విడుదల చేసిన టీజర్, ఫస్ట్‌లుక్, ఆడియోకు తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు.

ఇరవై నిముషాలు
ఓల్డ్ లుక్‌లో 20 నిమిషాలు.. రజనీకాంత్ ఈ సినిమాలో యంగ్, ఓల్డ్ లుక్‌లో కనిపిస్తారు.

ముల్లమ్ మలరమ్
యంగ్ లుక్ కోసం 1978లో ఆయన నటించిన 'ముల్లుమ్ మలరుమ్' చిత్రంలోని ఆయన పాత్రను రిఫరెన్స్‌గా తీసుకుని ఈ చిత్రంలో డిజైన్ చేశాం. ఓల్డ్ లుక్‌లో 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు.

అదే కథ
స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ వారు భారతీయులను మలేషియా తీసుకెళ్లి, అక్కడ రబ్బర్ ఫ్యాక్టరీలలో కూలీలుగా మార్చేశారు. అక్కడ ఉన్న సమస్యల కారణంగా కబాలి అనే వ్యక్తి డాన్‌గా ఎలా మారాడన్నదే ఈ చిత్రం.

యాక్షన్ మాత్రమే కాదు..
'కబాలి' అంటే అందరూ యాక్షన్ సినిమా అనుకుంటారు. కానీ ఇది ఎమోషన్స్‌తో కూడుకున్న చిత్రం.

సూపర్ గా ..
'ముల్లుమ్ మలరుమ్' చిత్రంలో రజనీ నటన సూపర్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో అంతకంటే అద్భుతంగా ఉంటుంది.

ఒకేరోజు
తెలుగు, తమిళంలో ఒకే రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.

ఇక్కడే కాదు...
హిందీ, జర్మనీ, మలేషియా, చైనా దేశాలతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

తదుపరి చిత్రం
నెక్ట్స్ సినిమా సూర్యతో.. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత సూర్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను.

ఇదిలా ఉంటే,
'కబాలి' పైరసీ బారిన పడకుండా చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ఇటీవల చెన్నై హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పరిస్థితి సమీక్షించిన ఉన్నత న్యాయస్థానం పైరసీకి చిరునామాగా ఉన్న దాదాపు 225 వెబ్‌సెట్లను స్తంభింపచేయాలని ఆదేశించింది.

విషాదాంతం
నిర్మాత ఎస్.థాను మాట్లాడుతూ,'ఇది కేవలం 'కబాలి' సినిమా కోసం వేసిన పిటిషన్ కాదు. తమిళ చిత్ర పరిశ్రమను అతలా కుతలం చేస్తున్న పైరసీ మహమ్మారిని తరిమికొట్టేందుకు చేసిన ప్రయత్నమిది. దీనివల్ల ఎందరో నిర్మాతలు రోడ్డున పడ్డారు. వెబ్‌సైట్లను స్తంభింపజేయడమనేది పైరసీపై సాధించిన తొలి విజయంగా భావిస్తున్నాను

వచ్చేస్తున్నాడు
ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా 'కబాలి' చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు.