twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ 'చీకటి రాజ్యం' : ఓ రాత్రి.. నాలుగు పాత్రలు

    By Srikanya
    |

    చెన్నై : ''ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరో ఎత్తు. ఓ కొత్త పంథాలో సాగే చిత్రమిది. ఓ రాత్రి జరిగే కథ ఇది. నాలుగు విభిన్నమైన పాత్రల చుట్టూ నడుస్తుంది. 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. జిబ్రాన్‌ సంగీతం ఆకట్టుకొంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము'' కమల్‌హాసన్‌ మాట్లాడుతూ అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'చీకటి రాజ్యం'. త్రిష హీరోయిన్. ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మాత. రాజేష్‌ ఎం.సెల్వన్‌ దర్శకుడు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    దర్శకుడు మాట్లాడుతూ... ''కమల్‌హాసన్‌లాంటి గొప్ప నటుడితో ప్రయాణం సాగించడం నా అదృష్టం. అబ్బూరి రవి అందించిన సంభాషణలు ఆకట్టుకొంటాయి. యాక్షన్‌ సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.

    అప్పట్లో 'ఆకలి రాజ్యం' అన్నారు కమల్‌ హాసన్‌. ఇప్పుడు 'చీకటి రాజ్యం' అంటున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మిస్తున్నారు.

    కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ''ఇదివరకు ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడిగారు. త్వరలోనే చేస్తానని చెప్పా. కానీ ఎవ్వరూ నమ్మలేదు. నేను మాత్రం నా మాటని నిలబెట్టుకొంటూ 'చీకటి రాజ్యం'మొదలుపెట్టా. ఈ సినిమాతో ఆగను. ఇకపై తరచుగా తెలుగులో సినిమాలు చేస్తుంటా. రాజేష్‌ నా శిష్యుడు. ఏడేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికి తనతో సినిమా చేయడం కుదిరింది. ప్రస్తుతం రాజేష్‌కి నేనొక బాలచందర్‌లా కనిపిస్తున్నా.

    Kamal about his latest Cheekati Rajyam

    నా గురువు బాలచందర్‌గారితో 37 సినిమాలకు కలిసి పని చేశాను. చివరి సినిమా 'ఉత్తమవిలన్‌' చేశాక ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన లక్షణాలు నాలో కొన్ని కనిపిస్తున్నాయి. నా కోపం, నటన అన్నీ బాలచందర్‌గారి నుంచి వచ్చినవే. 'చీకటి రాజ్యం' ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. సినిమా అనేది ఎవరి కారణంగా విజయం సాధిస్తుందో చెప్పలేం. 'షోలే'లో అందరికీ గబ్బర్‌సింగ్‌ పాత్రే గుర్తుంటుంది. అలా ఏ సినిమాతో ఎవరికి గుర్తింపు లభిస్తుందో తెలియది''అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఓ వరం. ఆ వరాన్ని కాపాడుకొంటూ అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమాని తీస్తాను''అన్నారు. 'కమల్‌హాసన్‌ సినిమాకు పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది'' అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి.

    ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ''కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి సినిమా గురించి చెప్పారు. తెలుగులోనూ తీయాలనుకొంటున్నాను అన్నారు. 'కమల్‌ ఓ మహానది. ఆ నది తెలుగుభాషని తాకుతూ వెళితే అంతకంటే ఆనందం ఏముంటుంది? అందుకే ప్రేక్షకులు కూడా అదే కోరుకొంటున్నారు' అని కమల్‌తో చెప్పాను''అన్నారు.

    ''ఇదివరకు ఎప్పుడూ చేయని ఓ కొత్త తరహా పాత్ర పోషించే అవకాశం లభించింది. కమల్‌ హాసన్‌ సర్‌తో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది''అని చెప్పింది త్రిష.

    ప్రకాష్‌రాజ్‌, కిషోర్‌, సంపత్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ: ప్రేమ్‌నివాస్‌, కూర్పు: విజయ్‌శంకర్‌, కెమెరా: సానుజాన్‌ వర్గుసే

    మరో ప్రక్క....

    ఈ చిత్రం Sleepless Night (2011) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. గతంలోనూ కమల్ చిత్రాలు రకరకాల పరభాషా చిత్రాల నుంచి ప్రేరణ పొందినవి కావటంతో ఇదే నిజమే కావచ్చుననే అంటున్నారు.

    ఓ పోలీస్ అధికారి.. ఒక రాత్రిలో తన కొడుకుతో పాటు ఉద్యోగాన్ని ఎలా కాపాడుకున్నాడు...చీకటి రాజ్యంలోని పెద్ద మనుష్యులను ఎలా బయిటపెట్టి, తుదముట్టించాడు అనేదే కథ.

    ఫ్రెంచ్ లో హిట్టయిన ఓ సినిమా కథను ఆధారంగా చేసుకుని.. దర్శకుడు రాజేశ్.. చీకటిరాజ్యం కథను తయారు చేసినట్టు చెప్పుకుంటున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో... టాలీవుడ్ బ్యూటీ మధుశాలిని హాట్ హాట్ గా కనిపించనుందట.

    సినిమా కథ అంతా ఓ రాత్రిలోనే ముగిసిపోతుందని.. అందులోనూ ట్విస్ట్ లు, లిప్ లాక్ సీన్లు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే... ఈ సినిమా స్టోరీని ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టారనే ప్రచారాన్ని దర్శకుడు రాజేశ్ కు క్లోజ్ గా ఉండే కొందరు ఖండిస్తున్నారు.

    English summary
    Actor-filmmaker Kamal Haasan Tamil thriller "Thoongaavanam", which goes on floors on 2 months back is titled "Cheekati Rajyam" in Telugu. The film will be simultaneously shot in Telugu and Tamil. The film, to be directed by Kamal's long-time associate Rajesh M. Selva, features Trisha Krishnan and Prakash Raj in important roles. Ghibran has been roped in to compose tunes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X