»   » గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ చిత్రం

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతమ్ మీనన్ తాజా చిత్రం 'ఏ మాయ చేసావె' అతనికి బాగా కలిసి వచ్చేటట్లు కనపడుతోంది. ప్రముఖ దర్శకుడు కమల్ హాసన్ తనతో ఓ చిత్రం ప్లాన్ చేయమని గౌతమ్ ని అడిగారని తెలుస్తంది. ఇంతకుముందు కమల్, గౌతం మీనన్ కాంబినేషన్ లో 'వేట్టయాడు విలయాడు' (రాఘవన్) చిత్రం వచ్చింది. అయితే అది ఊహించిన రేంజిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా తమిళంలో గౌతం రూపొందించిన 'విన్నైంతాడి వరువాయ' (శింబు, త్రిష) కమల్ చూసి చాలా అద్బుతం అని మెచ్చుకుని ఈ ఆఫర్ ఇచ్చారని తమిళ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ప్రస్తుతం కెఎస్ రవికుమార్ తో చేస్తున్న చిత్రం అనంతరం ఈ కొత్త చిత్రం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సారి యాక్షన్ స్టోరీ వద్దని రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేద్దామని కమల్ చెప్పటం జరిగిందిట. ఇక ఈ చిత్రానికి ఉదయగిరి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. త్రిషనే హీరోయిన్ గా అడుగుతారని తెలుస్తోంది. అలాగే ఎఆర్ రహమాన్ సంగీతం కూడా కన్ఫర్మ్ చేసారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో గౌతమ్ తెరకెక్కించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu