»   » దేవుడ్ని నమ్మనంటున్న కమల హాసన్‌

దేవుడ్ని నమ్మనంటున్న కమల హాసన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేవునిపై తనకు అసలు నమ్మకం అనేదే లేదని ప్రముఖ నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యానించారు. యువ నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ రెడ్‌జైయిన్‌ పతాకంపై సూర్య, నయనతార జంటగా నిర్మించిన చిత్రం ఆదవన్ శత దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా హాజరైన కమల్...హీరో సూర్య మాట్లాడిన దానికి కౌంటర్ గా పై విధంగా చెప్పుకొచ్చారు. హీరో సూర్య మాట్లాడింది ఏమిటంటే...సాధారణంగా కష్టమైన సీన్లలో నటించేటప్పుడు చాలా మంది దేవుని తలచుకుంటారని, తాను మాత్రం కమలహాసన్‌ను గుర్తు చేసుకుంటానని చెప్పారు. ఇలాంటి విజయాలను ఆయన ఏన్నో చూశారని తెలిపారు. ఆ దిశగా పయనించడానికి కమల్‌ తనకు సరైన మంత్రాన్ని ఉపదేశించాలని కోరారు. కమల హాసన్‌ మాట్లాడుతూ తాను స్వామీజీని కానని, దేవునిపై నమ్మకం కూడా లేదని, అలాంటప్పుడు సూర్యకు తానేమి మంత్రం చెప్పగలనని అన్నారు. సూర్య తండ్రి అప్పట్లో తన చేత మంత్రం చెప్పించడానికి ప్రయత్నించారని, ఇప్పుడు సూర్య ప్రయత్నిస్తున్నారని హాస్యమాడారు.ఇక ఆదవన్ చిత్రం తెలుగులో ఘటికుడు పేరుతో రిలీజ్ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu