twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం' డీటీహెచ్‌లోనే...కమల్ ప్రకటన

    By Srikanya
    |

    చెన్నై : 'మీరలా చేయకూడదు..' అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. 'విశ్వరూపం' తప్పకుండా డీటీహెచ్‌లో విడుదలవుతుంది. అందులో ఎలాంటి మార్పులేదు. ఎవరి నిబంధనలు, ఒత్తిళ్ల వల్లో విడుదలను వాయిదా వేయలేదు. నా స్నేహితుల సలహాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. థియేటర్‌లోనూ, డీటీహెచ్‌లోనూ ఒకే రోజున విడుదల చేయడంపై చర్చలు జరుగుతున్నాయి అంటూ కమల్ హాసన్ ప్రకటన చేసారు.

    ''విశ్వరూపం చిత్రాన్ని గత వారం రోజుల్లో పలు సమస్యలు చుట్టుముట్టాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాను'' అన్నారు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'విశ్వరూపం'. ఆయన అనుకున్న ప్రకారం ఈ నెల 11న థియేటర్లలోనూ, అంతకు ముందు రోజు రాత్రి నేరుగా ఇంటికే ప్రసారం (డీటీహెచ్‌) ద్వారా బుల్లి తెరపైన విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ విడుదలను వాయిదా వేశారు. బుధవారం కమల్‌హాసన్‌ చెన్నైలోని తన స్వగృహంలో పాత్రికేయులతో సమావేశమయ్యారు.

    కమల్ మాట్లాడుతూ ''విశ్వరూపం చిత్రం నా ఆస్తి. దాన్ని ఎలా వ్యాపారం చేసుకోవాలనే విషయంపై నేనే నిర్ణయం తీసుకుంటా. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. డీటీహెచ్‌ విధానం కొత్త దారి. ఇదే రేపు అందరి దారిగా మారుతుంది. శాటిలైట్‌ హక్కులు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు దాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అలాగే డీటీహెచ్‌ను అందరూ అభినందిస్తారు.కేవలం ఇంటికి మాత్రమే డీటీహెచ్‌లో చూసే సౌలభ్యాన్ని కల్పించాలి. అలా కాకుండా కేబుల్‌ ద్వారా, రెస్టారెంటు, పెద్ద కాంప్లెక్స్‌ల్లో విడుదల చేయడం చట్ట విరుద్ధం. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు. విడుదల తేదీని నేనే నిర్ణయిస్తా. ఎవరేం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. 'విశ్వరూపం' ఏ వర్గాన్నీ బాధించే సినిమా కాదు''అని చెప్పారు.

    విభిన్న పాత్రలతో విలక్షణ నటుడిగా వెలుగొందుతున్న కమల్‌హాసన్‌ చిత్రవ్యాపారంలోనూ అలాంటి ఒరవడే సృష్టించాలనుకున్నారు. దీనికి తన సొంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన 'విశ్వరూపం'ను ప్రయోగంగా ఎంచుకున్నారు. రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం తన ఖర్చులో అత్యధిక భాగాన్ని విడుదలకు ముందుగానే రాబట్టుకోవాలన్నది ఆయన ఆలోచన. దీనికి ఆయన వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సినిమా ప్రదర్శితమైన అనంతరం దానిని బుల్లితెరపై ప్రదర్శించేందుకు శాటిలైల్‌ హక్కులను విక్రయించటం ప్రస్తుతం కొనసాగుతున్న సంప్రదాయం. దీనికి విరుద్ధంగా విడుదలకు ముందే ఈ హక్కులను బుల్లితెరకు(డీటీహెచ్‌) విక్రయించటం ఆయన అనుసరించిన వినూత్న మార్గం.

    దీనికి డీటీహెచ్‌ సంస్థల నుంచి విశేషమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఐదు సంస్థలు ఈ చిత్రాన్ని విడుదలకు ఒకరోజు ముందే ఒకసారి ప్రదర్శించేందుకు హక్కులను పొందాయి. దీనికి ప్రతి వినియోగదారుడు తమిళ చిత్రానికి రూ.1000, తెలుగు, హిందీ చిత్రానికి రూ.500 ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సైతం డీటీహెచ్‌ సంస్థలు ఒకేసారి చెల్లింపు విధానాన్ని కాకుండా వచ్చిన మొత్తం వ్యాపారంలో వాటాల రూపంలో చిత్రనిర్మాణ సంస్థకు అందించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. డీటీహెచ్‌ సంస్థల నుంచి ఇంతటి స్పందనను కమల్‌హాసన్‌ సైతం ముందుగా ఊహించలేదు.

    ఈ చిత్ర నిర్మాణానికి రూ.120 కోట్ల ఖర్చుకాగా డీటీహెచ్‌ ప్రసారాల రూపంలో ఈ చిత్రం రూ.50 కోట్ల వరకు రాబడుతుందని అంచనావేయగా.. విశేష స్పందన అనంతరం ఈ మొత్తం 100 కోట్లను దాటి రూ.120 కోట్లకు చేరినా ఆశ్యర్యం లేదని సినీ విశ్లేషకులు అంచనావేశారు. ఇలా విడుదలకు ముందే డీటీహెచ్‌ ద్వారా ప్రదర్శించటం భారత సినీ చరిత్రలోనే ప్రప్రథమం. దీనిని ఈనెల 10న డీటీహెచ్‌ ద్వారా, 11న థియేటర్లలో ప్రదర్శించాలని ముందుగా నిర్ణయించారు. మరోవైపు దీనిపై వివాదాలూ ఇదే స్థాయిలో చెలరేగాయి. సినిమాను ప్రదర్శితం కాకుండా అడ్డుకుంటామని థియేటర్ల యజమానులు, పంపిణీదారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో చివరి నిమిషంలో సినిమాను వాయిదావేస్తున్నట్లు చిత్ర నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్‌హాసన్‌ బుధవారం ప్రకటించారు.

    ఈ చిత్రాన్ని వాయిదా వేయటమే కాదు ఒకరోజు ముందుగానే డీటీహెచ్‌లో ప్రదర్శించే అవకాశం కూడా దాదాపు లేనట్లే. డీటీహెచ్‌ ప్రసారాలకు సంబంధించి ఇప్పటికే వసూళ్లు ప్రారంభమైనందున దీనిని పూర్తిగా రద్దుచేసే అవకాశాలు మాత్రం లేవు. కాకపోతే థియేటర్లలో చిత్రం విడుదలరోజే డీటీహెచ్‌లోనూ ప్రసారం చేసే అవకాశాలున్నాయి. కమల్‌హాసన్‌ నిర్ణయం ఆయన అనుకున్న విధంగా పూర్తిగా అమలుకు నోచుకోకపోయినా ఆయన ఆలోచన మాత్రం దేశ సినీ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.

    English summary
    Kamal said as the 'Viswaroopam' film belongs to him he has every right to ensure profits with business acumen. He said this time the film's DTH screening and in theatres will be on the same date unlike the earlier one. Kamal also revealed that he had sent out legal notices to 13 individuals who threatened to misuse the DTH screening of his film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X