»   »  లాస్ ఏంజిల్స్ లో బ్రహ్మి రచ్చ రచ్చ

లాస్ ఏంజిల్స్ లో బ్రహ్మి రచ్చ రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న మూవీ 'శభాష్‌ నాయుడు'. ఈ చిత్రం షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో గత కొద్ది రోజులుగా షూటింగ్ చేసారు. ఈ షెడ్యూల్ పూర్తి అవటంతో కమల్ అందరికీ పార్టీ ఇచ్చారు .

ఈ షెడ్యూల్ లో బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా పాల్గొంటున్నారు. సినిమాలో వీళ్లిద్దరూ చాలా కీలకమైన రోల్స్ వేస్తున్నారు. ఇక వీరిరివురిపై వచ్చే సీన్స్ ని గత మూడు రోజులుగా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ సీన్స్ లో బ్రహ్మానందం హైలెట్ అవుతారని తెలుస్తోంది. షూటింగ్ సమయమంలో బ్రహ్మీ ఉత్సాహం, స్పాంటినిటీ చూసి కమల్ సైతం షాక్ అయ్యారని వార్తలు వినపడుతున్నాయి. అంతేకదా కమల్ ఎక్కడుంటే అక్కడ రచ్చ రచ్చే.

Kamal completes Los Angeles schedule!

ఇక శభాష్‌ నాయుడు సినిమాలో కమల్ హాసన్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నది. ప్రస్తుతం బాహుబలి 2 సినిమాలో చేస్తున్న శివగామి కమల్ సినిమా శభాష్ నాయుడు కోసం అమెరికా వెళ్లింది. కమల్ సినిమాలో అతని కూతురు శృతిహాసన్ కుమార్తెగానే చేస్తోంది.

కమల్ హాసన్ అదివరకు దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర వేశాడు. అదే కేరక్టర్ ను మెయిన్ గా తీసుకుని ఆ పాత్రకు సీక్వెల్‑లా శభాష్ నాయుడు సినిమా తీస్తున్నారు.

Kamal completes Los Angeles schedule!

గతంలో దర్శకుడిగా అనుభవం ఉన్న కమల్ హాసన్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను టికే రాజీవ్ కుమార్ డైరెక్ట్ చేయాల్సింది. కానీ లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుగుతుండగా రాజీవ్ కుమార్ హఠాత్తుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు.

ఇలా జరగడంతో యూనిట్ ఎంతో షాక్ కు గురైంది. దాంతో అనుకోని పరిస్థితిలో కమల్ హాసన్ శభాష్ నాయుడు డైరెక్షన్ బాధ్యతను చేపట్టాల్సి వచ్చింది. కమల్ తన సొంత బ్యానర్ పై తీస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది.

English summary
Kamal Haasan has completed the Los Angeles schedule of Sabash Naidu . He gave a wrap up party to his crew members.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu