»   » కమల్ 'దృశ్యం' రీమేక్ లో పెద్ద తప్పు దొర్లింది

కమల్ 'దృశ్యం' రీమేక్ లో పెద్ద తప్పు దొర్లింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తెలుగులో సూపర్ హిట్టైన 'దృశ్యం' చిత్రం తమిళంలో కమల్ హాసన్ హీరోగా 'పాపనాశం' పేరుతో రీమేక్ చేసి మొన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్కడ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే చిత్రంలో ఓ పెద్ద బండ్లర్ దొర్లినట్లు చెప్పుకుంటున్నారు. అదేమిటంటే....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమాలో కమల్ హాసన్... ఆగస్టు 3న ...అంజాన్ (తెలుగులో సికిందర్) చిత్రానికి తన పిల్లలను తీసుకు వెళ్ళతాడు. అయితే ...నిజానికి ...ఆగస్టు 15న అంజాన్ చిత్రం విడుదల అయ్యింది. అది గమనించకుండా...ఆగస్టు 3 అని చెప్పారు. అదే తేది మీద కథ నడుస్తూంటుంది. ఇలాంటి విషయాన్ని కమల్ ఎలా మర్చిపోయాడు అని తమిళ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.

Kamal goofs up in Paapanasam

ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 39 రోజుల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. కమల్ సహకారంతోనే త్వరగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయగలిగామని సినీ యూనిట్ తెలిపింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం' సినిమాని కమల్ హాసన్ తమిళంలో ‘పాపనాశం' పేరుతో రీమేక్ చేసారు. ఈ మూవీలో కమల్ హాసన్ కి జోడీగా అలనాటి నటి గౌతమి నటించింది.

‘దృశ్యం' సినిమా ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తమిళంలో కూడా మంచి విజయం సాధిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

English summary
Kamal created major blunder in ‘Paapanasam’ film. In the film Kamal takes his family to a theatre to show them Surya's ‘Anjaan’ on August, 3rd. However Kamal missed a point that Surya's Anjaan was released on 15th August.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu